కాళోజి చిరస్మరణీయ ప్రజాకవి


నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌


హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ సేవలను కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. జీవితాంతం ప్రజల గొంతుకగా బతికిన కాళోజి నారాయణ రావు ఎప్పటికీ స్మరణీయుడే అని సీఎం అన్నారు. తన మాట, సాహిత్యం ద్వారా తెలంగాణ సమాజాన్ని నిత్యం చైతన్య పరిచిన వైతాళికుడు కాళోజి అని కేసీఆర్‌ కొనియాడారు. ఇదిలావుంటే నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. విలువలు చాటిన మహనీయుడిగా ప్రఖ్యాతి పొందారని అన్నారు. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర&ఢంగా ఆయనకు నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవతే కేంద్రంగా కవిత్వాన్ని రాసి ప్రపంచ వ్యాప్తం చేసిన వ్యక్తి కాళోజీ అని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పారు. కాళోజీ ఆశీస్సులతో సీఎం కేసీఆర్‌ ఆచరణతో సాంస్కృతిక తెలంగాణగా మారుతుందన్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనం , మొత్తం తెలంగాణ అభివృద్దిగా మారుతుందని ఆకాంక్షించారు. కాళోజీ జీవితమే ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో అనేక మంది కవులుగా ప్రసిద్ది పొందారని అన్నారు.