వారెవా ..క్యా బాత్‌ హై

 



బర్త్‌ డే గిఫ్ట్‌ గా తెలంగాణ గెలవాలి

చిన్నారి సమాధానానికి ముగ్ధుడైన కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త బిడ్డ పుట్టినరోజున..

 సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌ అందించిన కేటీఆర్‌  

స్వయంగా ఫోన్‌ చేసి పాపతో మాట్లాడిన కేటీఆర్‌

 పట్టరాని సంతోషంతో కృతఙ్ఞతలు చెప్పిన పాప

హైదరాబాద్‌ 11 మార్చి (జనంసాక్షి) :

పార్టీ కార్యకర్తల త్యాగాలు, నిబద్దత విూదనే  టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్మాణం అయింది . ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని ఉద్ఘాటించిన కేటీఆర్‌ కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్‌ హుస్సేన్‌, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు, హైదరాబాద్‌ నగరంలో గత 20 రోజులుగా ఉంటూ, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతోంది. ఈ క్రమంలో  ఖాజా నవాజ్‌ హుస్సేన్‌ మామ చనిపోవడం జరిగింది. అయినప్పటికీ పార్టీ అప్పజెప్పిన భాద్యతలను నిర్వర్తించడానికి, ఎన్నికల సమయం కూడా సవిూపిస్తుండటంతో అంత్యక్రియలకు కూడా హాజరు కాకూండా హైదరాబాద్‌ లోనే ఉంటూ పార్టీ అప్పజెప్పిన విధులను నిర్వహించారు. మరోవైపు.. ఖాజా నవాజ్‌ హుస్సేన్‌ భార్య తొమ్మిది నెలల గర్భవతి. అయినప్పటికీ ఫోన్‌ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటూ భార్యకు దైర్యం చెబుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతోంది. శుక్రవారం రోజున టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ విషయం తన దృష్టికి రావడం జరిగింది.  పార్టీ కార్యకర్త నిబద్ధతకు చలించిపోయిన కేటీఆర్‌ ఖాజా నవాజ్‌ హుస్సేన్‌ యోగక్షేమాలు విచారిస్తున్న సందర్భంలో.. శనివారం తన కూతురు నబీలా మహమ్మద్‌ పుట్టిన రోజు విషయం ప్రస్తావించడం జరిగింది.వెంటనే పుట్టిన రోజు కానుకగా సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌ ను పాపకు అక్కడి పార్టీ నాయకుల ద్వారా కేటీఆర్‌ అందించడం జరిగింది. అంతేకాదు పాపకు స్వయంగా ఫోన్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ క్రమంలో ఇంకా ఏం కావాలి అంటూ కేటీఆర్‌ పాపను అడుగగా, నాకేవిూ వద్దు.. తెలంగాణ గెలిస్తే  అంతే చాలు అన్న పాప సమాధానం విని  కేటీఆర్‌ చలించిపోయారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల కార్యకర్తలకు, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనం అని తెలిపారు.   టీఆర్‌ఎస్‌ పార్టీకి బలం కార్యకర్తల నిబద్దత.. వారి త్యాగాలే అని కేటీఆర్‌ పేర్కొన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, వారికి ఏ ఆపద వచ్చినా వారికి, వారి కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ కోసం ఎత్తిన గులాబీ జెండా.. రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటుందని తెలిపారు.