ఔటర్ విూదుగా ట్రిఫిక్ మల్లింపు
హిమాయాత్ సాగ్ గేట్లు ఎత్తి నీటి విడుదలహైదరాబాద్,సెప్టెంబర్28 (జనంసాక్షి) : గగన్‌పహాడ్ వద్ద అప్ప చెరువుకు వరద పోటెత్తింది. దీంతో అప్ప చెరువు అలుగు పొంగిపొర్లుతున్నది. ఈ క్రమంలో హైదరాబాద్`బెంగళూరు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు విూదుగా వెళ్లాలని సూచించారు. శంషాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మరోవైపు నగర శివార్లలోని హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. ఇప్పటికే రెండు గేట్లను తెరిచి ఉంచగా, మంగళవారం ఉదయం మరో నాలుగు గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు ఔట్ ప్లో, ఇన్ ఎª`లో 4,200 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,763.50 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు. ఉస్మాన్ సాగర్‌కు కూడా వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు ఇన్ ప్లో, ఔట్ ఎª`లో 2 వేల క్యూసెక్కులుగా ఉంది. నిన్న రెండు గేట్లను రెండు ఫీట్ల వరకు తెరువగా, ఇవాళ మూడు ఫీట్ల వరకు లిప్ట్ చేశారు. ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1790 అడుగులుగా ఉంది.