జయంతి వేడుకల్లో పార్టీ నేత లక్ష్మణ్
హైదరాబాద్,సెప్టెంబర్25 (జనంసాక్షి) దీన్ దయాల్ స్ఫూర్తితోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన చేస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. దీన్ దయాల్ జయంతి సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మణ్, డీకే అరుణ్ పాల్గొని నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ దీన్ దయాల్ జీవితాంతం పేదలు, వెనుకబడి వర్గాల కోసం పని చేశారన్నారు. రాజకీయంగా దీన్ దయాల్ ఉపాధ్యాయను విభేదించినా.. అన్ని పార్టీల వారు గౌరవించే వ్యక్తి అని తెలిపారు. ఆత్మ నిర్బర్ భారత్‌తో మోదీ ముందుకు వెళుతున్నారని లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మజ్లిస్ పార్టీకి లొంగి.. కేసీఆర్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన అన్నారు. చరిత్ర వెలుగులోకి వస్తే మజ్లీస్‌కు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు రాజకీయ మనుగడ ఉండదని హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను తెరమరుగు చేస్తున్నారన్నారు. నిజాంకు, కేసీఆర్‌కు ఎలాంటి తేడా లేదని...ఊసర వెల్లిలా కేసీఆర్ రంగులు మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. డీకే అరుణ మాట్లాడుతూ...దీన్ దయాల్ జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోందన్నారు. మొక్కలు పెంచడమే
ఆయనకు సరైన నివాళి అని అన్నారు. నవ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ్గªళిసీఆర్ నియంతలా వ్యవహరుస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు.
దీన్‌దయాల్ బాటలో మోడీ పయనం