ఎంపిటిసి,జడ్పీటిసిలకు జెండా ఎగురవేసే అవకాశం


మండలిలో ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): కేంద్రం 15 ఫైనాన్స్‌ కమిషన్‌లో స్థానిక సంస్థలకు రూ. 500 కోట్లు లోటు పెట్టినా.. మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు సభ్యుల గౌరవాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదనంగా రూ. 500 కోట్లు కేటాయించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసన
మండలిలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
దీంతో ఎంపీపీలు, జడ్పీటీసీలు హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీలకు పర్మినెంట్‌ ఆఫీసులు లేకపోవడం తీరని లోటుగా ఉంది. కనీసం గ్రామపంచాయతీల్లో ఎంపీటీసీలకు కూర్చుందామంటే కుర్చీ లేదు. ఈ విషయంలో తగు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్వాతంత్య, గణతంత్య దినోత్సవం నాడు పాఠశాలలో జెండా ఎగురవేసి అధికారం ఎంపీటీసీ,జెడ్పీటీసీలకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.