టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్న మొయిన్ అలీ
లండన్,సెప్టెంబర్27 (జనంసాక్షి) : మరో క్రికెట్ దిగ్గజం రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇంగ్లండ్ టీమ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు బ్రిటిష్ విూడియా వెల్లడిరచింది. తాను రిటైర్ అవుతున్న విషయాన్ని మొయిన్ అలీ ఇప్పటికే కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌కు చెప్పినట్లు అక్కడి విూడియా తెలిపింది. ఇంగ్లండ్ తరఫున 64 టెస్టులు ఆడిన మొయిన్ అలీ 2914 పరుగులు చేయడంతోపాటు 195 వికెట్లు తీశాడు. 2019 యాషెస్ సిరీస్ తర్వాత అతడు పెద్దగా టెస్ట్ క్రికెట్‌లో కనిపించలేదు. ఇండియాతో టెస్ట్ సిరీస్‌లో మళ్లీ చోటు దక్కించుకున్న అతడు మూడు టెస్టుల్లో ఆడాడు. మంచి క్రికెటర్‌గా అతను ఇంగ్లండ్‌కు వెన్నుముకగా నిలిచాడు.
రిటైర్‌మెంట్ ప్రకటించిన మరో క్రికెట్ దిగ్గజం