హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడింది. శనివారం మధ్యాహ్న సమయంలో నగరం వర్షంతో తడిసిముద్దయ్యింది. బంజరాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా, రాజేంద్రనగర్, అత్తాపూర్‌లో భారీ వర్షం కురిసింది. ఇక మలక్‌పేట్, దిల్‌షుక్‌నగర్‌లో కుండపోత వర్షం పడింది. రహదారులు చెరువుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నగరంలోని చైతన్యపురి కాలనీ నీట మునిగింది. పలు చోట్ల రహదారులపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు..