తెలంగాణాలో సరిపడా బొగ్గు నిల్వలు

 



సింగరేణితో ఒప్పందం మేరకు ప్లంట్లకు సరఫరా
వెల్లడిరచిన సింగరేణి డైరెక్టర్లు
హైదరాబాద్‌,అక్టోబర్‌12( జనం సాక్షి ): సింగరేణితో ఒప్పందం చేసుకున్న రాష్టాల్ర థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకు అవసరం మేరకు బొగ్గు సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌, ఎన్‌.బలరామ్‌ తెలిపారు. తెలంగాణలోని అన్ని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో కనీసం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని.. రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. దేశంలో బొగ్గు కొరత వార్తల నేపథ్యంలో జీఎంలతో డైరెక్టర్లు సవిూక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో పలు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందని వార్తలు వస్తున్నాయని.. కానీ, తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. అక్టోబరు నెలలో రోజూ 1.9లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని, కనీసం 34 ర్యాకులకు తగ్గకుండా బొగ్గు రవాణా చేయాలని డైరెక్టర్లు దిశానిర్దేశం చేశారు. సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం చేసుకొన్న తెలంగాణ జెన్‌కో, ముద్దనూరు ఏపీ జెన్కో, పర్లీ మహా జెన్కో, రాయచూర్‌ కేపీసీఎల్‌, మెట్టూర్‌ టాన్‌ జెడ్కో, రామగుండం ఎన్టీపీసీ, ఎస్టీపీపీతోపాటు బ్రిడ్జ్‌ లింకేజీ కలిగివున్న విద్యుత్‌ కేంద్రాలైన ఏపీలోని వీటీపీఎస్‌, మహారాష్ట్రలోని కొరడి, షోలాపూర్‌ ఎన్‌టీపీసీ, కర్ణాటక ఎరమరాస్‌ తదితర విద్యుత్‌ కేంద్రాల అవసరాల మేరకు బొగ్గు సరఫరా చేయాలన్నారు. ఇకపోతే తెలంగాణలో జెన్‌కో పరిధిలోని 540 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భద్రాద్రి ప్లాంట్‌లో నాలుగు రోజులకు సరిపడా నిల్వలుండగా.. వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న కేటీపీఎస్‌ 5,6 ప్లాంట్లు.. 1200 మెగావాట్ల సామర్థ్యమున్న ఎస్‌టీపీపీలో 5 రోజులకు మాత్రమే నిల్వలు ఉన్నాయి. కేటీపీఎస్‌`7లో ఎనిమిది, కేటీపీపీలో 13 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. నిల్వలు పూర్తవ్వగానే థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు వాటంతట అవే షట్‌డౌన్‌ అవుతాయి. దీంతో జలవిద్యుత్తు కేంద్రాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భూపాలపల్లిలోని జెన్‌కో ప్లాంట్‌లో 17 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. ఏపీ జెన్‌కోకు చెందిన రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ముద్దనూరు), విజయవాడలోని ఎన్‌టీటీపీఎస్‌, విశాఖపట్నంలోని ఎన్టీపీసీ`సింహాద్రి థర్మల్‌ కేంద్రాలలో కేవలం ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. తమిళనాడులో ఎన్‌టీపీసీకి చెందిన కుడ్గి ప్లాంట్‌లో ఒక్క రోజుకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌కూ.. ఉత్పత్తికి మధ్య 20? వ్యత్యాసం ఉందని విద్యుత్తు వాడకంలో పొదుపు పాటించాలని ఏపీ
ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బహిరంగ మార్కెట్లో యూనిట్‌కు రూ.14, పీక్‌ సమయంలో యూనిట్‌కు రూ.20 చొప్పున చెల్లించి కరెంటు కొంటున్నామని తెలిపింది. ఉదయం 6 నుంచి 9 గంటలు ` సాయంత్రం 6 నుంచి రాత్రి 10గంటల మధ్య ఏసీల వాడకాన్ని నిలిపివేయాలని ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ ఇప్పటికే ప్రజలను కోరారు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలలో బొగ్గుతోపాటు బయోమాస్‌ పెల్లెట్లు మండిరచి ఉత్పత్తి చేయాలని జెన్‌కోలను కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఆదేశించింది. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు విధిగా 25 ఏళ్లపాటు బయోమాస్‌ పెల్లెట్లను వినియోగించాలనే నిబంధనను గుర్తుచేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బయోమాస్‌ పెª`లలెట్ల ధర టన్నుకు రూ.5500ల దాకా ఉంది. దాంతో అదనంగా అయ్యే వ్యయాన్ని చార్జీల రూపంలో వసూలు చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు.