28న ప్రీ మెగా లోక్‌ అదాలత్‌

బ్యాంకు వ్యవహారాలపై తీర్పులు

కర్నూలు,డిసెంబర్‌24(జనం సాక్షి): ఈ నెల 28న ప్రీ మెగా లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌ వెంకట నాగశ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వీఆర్‌కే కృపాసాగర్‌ ఆదేశాల మేరకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ లోక్‌ అదాలత్‌లో స్టేట్‌బ్యాంకు సంబందించిన బకాయిల కేసులు పరిష్కరిస్తామని, కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవడానికి సంబంధిత స్టేట్‌ బ్యాంకు అధికారులను సంప్రదించాలని ఆయన ప్రకటనలో తెలిపారు. ఈ కేసులలో బకాయిల మొత్తంలో 10 నుంచి 75 శాతం మేరకు రాయితీ కల్పించేటట్లు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. కక్షిదారులు వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.