` విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశాం
` సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
హైదరాబాద్,డిసెంబరు 23(జనంసాక్షి): మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విూడియాకు వివరించారు. ఈ కేసుకు సంబంధించి మహమ్మద్ అష్రాఫ్ బేగ్, రామేశ్వర శ్రవణ్ కుమార్, చరణ్ తేజ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ప్రస్తుతం ఇందులో ప్రధాన నిందితుడు జూడ్ పరారీలో ఉన్నాడని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నైజీరియాకు చెందిన జూడ్ అనే వ్యక్తి ద్వారా ముఠా సభ్యులు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గోవా నుంచి భారీగా డ్రగ్స్‌ను తెప్పించి ముఠా సభ్యులు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. 2021లో సైబరాబాద్ పరిధిలో 202 కేసులు నమోదు కాగా.. 419 మందిని అరెస్ట్ చేశాం. రిపీటెడ్‌గా డ్రగ్స్‌తో పట్టుబడుతున్న 23 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎస్టేసి ట్యాª`లబెట్‌ను స్వాధీనం చేసుకున్నాం. మొత్తం 26 లక్షల 28 వేల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
గోవా నుంచి హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్..