రెండు బస్సులు దగ్ధం
సంగారెడ్డి,డిసెబర్17 (జనంసాక్షి): జిల్లా పరిధిలోని మ్యాక్సన్ హెల్త్ కేర్ పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మ్యాక్సన్ పరిశ్రమలో నిలిపి ఉంచిన రెండు బస్సుల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్కారణంగానే మంటలు చెలరేగినట్లు కార్మికులు అనుమానం వ్యక్తం చేశారు. మంటల్లో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.