విజయనగరం,డిసెంబర్24(జనం సాక్షి): జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో ఈ నెల 25, 26 తేదీల్లో
చదరంగం పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీఏ రావు, జ్వాలాముఖి తెలిపారు. 2002, జనవరి 1 తర్వాత పుట్టిన పుట్టిన బాలబాలికలు ఈ క్రీడలో పాల్గొనొచ్చని, జనన ధ్రువీ కరణ పత్రం తప్పనిసరిగా తీసుకు రావాలని పేర్కొన్నారు. ఓపెన్‌లో నలుగురు క్రీడాకారులను, బాలికల విభాగంలో నలుగురిని ఎంపిక చేస్తామన్నారు. వచ్చే నెల 9 నుంచి 15 వరకూ ఢల్లీిలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఆంధ్రా చెస్ అసోసియేషన్ సొంత ఖర్చులతో వారిని పంపించనున్నట్టు తెలిపారు.
రెండ్రోజులపాటు చెస్ పోటీలు