లారీని ఢీకొన్న బైకు

ముగ్గురు వ్యక్తుల దుర్మరణం

మెదక్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, బైక్‌ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. చేగుంట మండల కేంద్రం అనంతసాగర్‌ రోడ్‌లోని జీవికా పరిశ్రమ నుంచి వస్తున్న లారీని బైక్‌ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పల్లె రాకేష్‌ (21), అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరు దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందారు. పల్లె ప్రదీప్‌ (17) పండ్ల అరవింద్‌ (15) మార్గమధ్యంలో మృతి చెందారు. కాగా, ప్లలె ప్రదీప్‌ చేగుంట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, పండ్ల అరవింద్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరిని ప్రదీప్‌ అన్న పల్లె రాకేష్‌ చేగుంటలో బైక్‌పై డ్రాప్‌ చేసేందుకు వెళ్తుండగా.. జీవిక పరిశ్రమ నుంచి వస్తున్న లారీని బైకు ఢీకొట్టింది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ వద్ద ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.