హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నాం
` చెత్త సేకరణలో నగరం ఎంతగానో మెరుగుపడిరది` మంత్రి కేటీఆర్
హైదరాబాద్,డిసెంబరు 13(జనంసాక్షి): సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో మరో 1,350 స్వచ్ఛ ఆటోల పంపిణీకి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టింది. ఖైరతాబాద్‌లో ఆటోల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలసి కేటీఆర్ పాల్గొన్నారు.ఆరేళ్లలో హైదరాబాద్ చెత్త సేకరణ ఎంతగానో మెరుగుపడిరదన్న కేటీఆర్.. అందుకు సహకరిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో హైదరాబాద్ నిరంతరం ముందుంటోందని ఆయన చెప్పారు. చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే 20మెగావాట్ల ప్లాంట్‌ను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జవహర్‌నగర్‌లో ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలోనే మరో 28 మెగావాట్ల వేస్ట్ టు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వెల్లడిరచారు.‘‘గతంలో 3,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరించేవారు. ప్రస్తుతం ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ జరుగుతోంది. ఇప్పడు నగరంలో 6,500మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. చెత్త నుంచి పెద్ద ఎత్తున విద్యుదుత్పత్తి జరుగుతోంది. దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద ప్లాంట్ హైదరాబాద్‌లో ఉంది. రాబోయే రోజుల్లో మొత్తం చెత్తను రీసైకిల్ చేస్తాం. పారిశుద్ధ్య కార్మికులు అడగకుండానే సీఎం మూడుసార్లు జీతాలు పెంచారు’’ అని కేటీఆర్ అన్నారు.