11మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి
న్యూఢల్లీి,డిసెంబర్23 (జనం సాక్షి) : పెరల్ గ్రూప్‌కు సంబంధించిన కేసులో 11 మందిని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ గురువారం అరెస్టు చేసింది. మోసపూరిత స్కీమ్‌ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐదు కోట్ల మందికి పైగా జనాభా నుండి 60 వేల కోట్ల రూపాయలను ఈ సంస్థ వసూలు చేసిందన్న ఆరోపణలపై ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి. పెరల్ గ్రూపుకు చెందిన 11 మంది ఉద్యోగులను, వ్యాపార వేత్తలను అరెస్టు చేశామని సిబిఐ అధికారులు తెలిపారు. ఢల్లీి, చండీఘర్, కోల్‌కతా, భువనేశ్వర్, ఇతర ప్రాంతాల నుండి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలను ఉద్దేశపూర్వకంగా మోసగించిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ గతంలో ప్రాథమిక దర్యాపు చేపట్టినట్లు తెలిపారు. ఈ దర్యాప్తుల ఎం/ఎస్. పిజిఎఫ్ లిమిటెడ్, ఎం/ఎస్ పిఎసిఎల్ లిమిటెడ్, నిర్మల్ సింగ్ భాంగో, పెరల్ గ్రూప్‌కు చెందిన రెండు ప్రధాన కంపెనీ డైరెక్టర్లతో పాటు ఇతరులపై అభియోగాలు మోపినట్లు వెల్లడిరచారు. విచారణ సమయంలో అనగా 2016లో నిర్మల్, సుఖ్‌దేవ్ సింగ్, సుబ్రతా భట్టాచార్య, గుర్మీత్ సింగ్‌ను అరెస్టు చేసి.. చార్జీషీటు దాఖలు చేశారు.
పెరల్ గ్రూపు కేసులో సిబిఐ దూకుడు