ఛత్తీస్‌గఢ్ మంత్రి లక్మ విమర్శలు
భద్రాచలం,డిసెంబర్20(జనం సాక్షి ): దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల రామ క్షేత్ర అభివృద్ధిపై కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వివక్ష చూపుతున్నాయని చత్తీస్‌గడ్ ఎక్సైజ్ శాఖమంత్రి కొవ్వాసి లక్మ ప్రశ్నించారు. సోమవారం నాడు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని లక్మ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా దేవస్థానం తరఫున స్వామివారి ప్రసాదాన్ని శాలువా జ్ఞాపికను మంత్రి లక్మకు భద్రాద్రి దేవస్థానం ఈవో శివాజీ అందజేశారు. అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో కేసీఆర్.. భద్రాది ఆలయాభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తామన్నారని కానీ నేటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదని మండిపడ్డారు.
భద్రాచల ఆలయ అభివృద్దిపై వివక్ష