కెసిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

 


బెజ్జంకి,ఫిబ్రవరి3,(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం ముందు బిజెపి భీమ్ దీక్ష 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మండల అధ్యక్షులు దోనె అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీక్షను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని చేసిన ప్రకటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బాబా సాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో 369 నిబంధనలు, 8 షెడ్యూళ్లతోటి అతిపెద్ద లిఖితపూర్వక భారత రాజ్యాంగాన్ని బాబూ రాజేంద్రప్రసాద్ గారికి 1950 నవంబర్ 23న అందించిన రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన కేసీఆర్ కు రావడం దురదృష్టకరం.కెసిఆర్ భేషరతుగా జాతికి క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలోప్రధాన కార్యదర్శులు దొంతరవేని శ్రీనివాస్, బోయిన్పల్లి అనిల్ రావు, మండల ఉపాధ్యక్షులు గైని రాజు, మాజీ ఎంపిటిసి కొండల వెంకటేశం, ఓ బి సి మొర్చ అధ్యక్షులు బండి పెళ్లి సత్యనారాయణ, వడ్లూరీ శ్రీనివాస్, వడ్లూరి సాయిలు, శీలం వెంకటేశం,పట్టణ అధ్యక్షులు సంగ రవి, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గంప రవికుమార్ గుప్త, గంగాధర తిరుపతి, తదితరులు పాల్గొన్నారు