లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు కంప్యూటర్ బహుకరణ.

 


పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన దృశ్యం.

నేరేడుచర్ల జనం సాక్షి న్యూస్.లయన్స్ క్లబ్ నేరేడుచర్ల  ఆధ్వర్యంలో మండలంలోని మేడారం గ్రామంలో ఉన్నత పాఠశాల కి పది వేల రూపాయల విలువ గల కంప్యూటర్ ను దాతల సహకారంతో అందజేసినట్లు అధ్యక్షులు కంది బండ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభన్ బాబు  మాట్లాడుతూ ఇప్పటివరకు స్కూల్ వర్క్ మొత్తం బయట  చేయించే వారని,ఇప్పుడు కంప్యూటర్ వల్ల స్కూల్లోనే వర్క్ చేయటం వలన బయటకు వెళ్లే ఇబ్బంది తగ్గుతుందని దీనివల్ల విద్యార్థులకు స్కూల్ కి చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడారం గ్రామ సర్పంచ్ స్వాతి మధు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు సుంకరి క్రాంతి కుమార్, ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాసరావు మరియు కర్రీ సూరిబాబు క్లబ్ సెక్రటరీ ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి, ట్రెజరర్ చల్ల ప్రభాకర్ రెడ్డి సభ్యులు గుండా సత్యనారాయణ జిలకర రామస్వామి,రామకృష్ణ, ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి  సత్యనారాయణ,జీ.కవిత,వై. గంగయ్య తదితరులు  పాల్గొన్నారు .