నాలా అభివృద్ది పనులకు శ్రీకరారం


ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ వద్ద 12.86 కోట్ల పనులు: తలసాని

హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఎర్రగడ్డ మెట్రోస్టేషన్‌ దగ్గర నాలా అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. నాలాల అభివృద్ధితోనే ముంపు బాధల నుంచి విముక్తి కలుగుతుందని తలసాని పేర్కొన్నారు. ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంతో పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధి పనులు చేపడుతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ వద్ద 12.86 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నాలా అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.ఈ కార్యక్రమం ద్వారా నాలాల అభివృద్ధితో ముంపు నుంచి పరిసర ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయల ఖర్చుతో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాధ్‌, మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, సనత్‌ నగర్‌ కార్పొరేటర్‌ కొలన్‌ లక్ష్మి పాల్గొన్నారు.