కేదార్‌నాథ్‌లో భారీగా మంచు


మైనస్‌ 7 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు


న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): కేదార్‌నాథ్‌లో భారీ మంచు కురుస్తున్నది. ఆలయ పరిసరాలన్నీ మంచు ఫలకాలుగా మారిపోయాయి. అక్కడ మైనస్‌ 7 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవుతోంది. మరో వారం రోజుల పాటు కూడా జ్యోతిర్లింగ క్షేత్రంలో భారీ మంచు కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఉత్తరాఖండ్‌తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా మంచు కురుస్తున్నది. షిమ్లాలోని నార్కండ ప్రాంతం మంచు అందాలతో పరవశించిపోతున్నది.