all news

 1 .మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం చేస్తాం

` బీహార్‌లో కొలువుదీరిన మహాఘట్‌బంధన్‌

` సిఎంగా నితీశ్‌ కుమార్‌, డిప్యూటీగా తేజస్వీ యాదవ్‌

పాట్నా(జనంసాక్షి):బీహార్‌లో ’మహా ఘట్‌బంధన్‌’ ప్రభుత్వం కొలువుతీరింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఫగు చౌహాన్‌ వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులను తదుపరి క్రమంలో నితీష్‌ తన క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం తేజస్వికి నితీష్‌ అభినందనలు చెప్పారు. నితీష్‌ పాదాలకు తేజస్వి నమస్కరించే ప్రయత్నం చేయడంతో ఆయన వారించి నవ్వుతూ కరచాలనం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, మహా కూటమి నేతలు హాజరయ్యారు. బీహార్‌ సీఎంగా నితీష్‌ పగ్గాలు చేపట్టడం ఇది ఎనిమిదో సారి. బిజెపితో తెగగదెంపులు చేసుకున్న నితీశ్‌ ఆర్జెడితో కలసి ప్రబుత్వం ఏర్పాఉట చేశారు. బీహార్‌ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా, జేడీయూకు 43, ఆర్జేడీ 79, సీపీఐ (ఎంఎల్‌)కు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. 2020లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్డీయే కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కాగా, బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్‌ఏఎల్‌తో కలిసి నితీశ్‌ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిరది. ఈ కూటమిలో ఈ ఏడాది ప్రారంభంలో చీలికలు ప్రారంభమయ్యాయి. చివరకు బీజేపీతో నితీశ్‌కుమార్‌ తెగతెంపులు చేసుకున్నారు.
2.గాడ్సేను కీర్తించి గాంధీని విమర్శిస్తారా..

` మైకేమైనా లజ్జ ఉందా!

` దేశానికి బలమైన పునాది వేసింది మహాత్మా గాంధీ 

` మహనీయులను కించపరచడం తగదు

` వారిని స్మరించుకోవడమే నిజమైన నివాళి

` రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌,మంత్రి గంగుల

కరీంనగర్‌ బ్యూరో ( జనం సాక్షి )  :దేశానికి బలమైన పునాదిని వేసిన జాతి పిత మహాత్మా గాంధీ అని, శాస్త్రీయ దృక్పథం నేర్పిన దేశ మొదటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ అని, కానీ ఆ ఇద్దరు మహనీయులను కించపరుస్తూ కొన్ని శక్తులు సోషియల్‌ విూడియాలో దుష్ట ప్రచారం చేయడం తగదు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.మహాత్మా గాంధీని చంపిన గాడ్సే లను కీర్తిస్తూ సోషియల్‌ విూడియాలో పోస్టింగ్స్‌ దుర్మార్గం అని వినోద్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత దేశ వజ్రొత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్‌ నగరంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో మంత్రి గంగుల కమలాకర్‌ తో కలిసి వినోద్‌ కుమార్‌ బుధవారం మొక్కలు నాటారు.ఆ తరువాత మంత్రి కమలాకర్‌, జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రతిమా మల్టీ ఫ్లెక్స్‌ లో గాంధీ సినిమాను వీక్షించారు.ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే  దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు.దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కెసీఆర్‌ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాం అని వినోద్‌ కుమార్‌ తెలిపారు.అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన  మహనీయుడు మహాత్మాగాంధీ అని వినోద్‌ కుమార్‌ కొనియాడారు.మహాత్మా గాంధీ గురించిన శాంతియుత పోరాట పటిమ, పట్టుదల విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఉచితంగా గాంధీ చిత్ర ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రీడమ్‌ పార్క్‌ లను ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు.ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేసి  జాతి సమైక్యత, స్ఫూర్తిని చాటాలని వినోద్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.గాంధీ సినిమాను వీక్షించిన వినోద్‌ కుమార్‌, గంగుల :రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌,రాష్ట్ర బి సి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ , కలెక్టర్‌ కర్ణన్‌, పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ, మేయర్‌ సునీల్‌ రావులతో కలసి గాంధీ చిత్రాన్ని బుధవారం కరీంనగర్‌ లోని ప్రతిమా మల్టీ ప్లెక్స్‌ లో వీక్షించారు. ఈ సందర్బంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని అన్నారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థుల కోసం గాంధీ చిత్ర ప్రదర్శన ఈ నెల 11 నుంచి 21 తేదీ వరకు కరీంనగర్‌ జిల్లాలోని 13 సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపా రాణి, అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌ , కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.


3.మునుగోడు టీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ భేటి

` గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్‌(జనంసాక్షి):మునుగోడులో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపుకోసం అందరూ ఏకతాటిపై పనిచేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బుధవారం మునుగోడు టీఆర్‌ఎస్‌ నాయకులు,కార్యకర్తలు మంత్రి మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేశారు. కాగా మునుగోడు టీఆర్‌ఎస్‌లో అందరూ ఐక్యంగా ఉన్నారని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలువబోతున్నారని తెలిపారు. ఇవాళ్టి నుంచి ఉప ఎన్నిక ముగిసే వరకు విశ్రమించేది లేదని మంత్రి తేల్చిచెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు.మునుగోడు నియోజవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో సమావేశం అనంతరం జగదీశ్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మునుగోడు టీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశం జరిపామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశమై చర్చించామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేస్తాం. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌నే గెలిపిస్తమని ప్రజలు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన వారిని ప్రజలు ఎండగట్టాలన్నారు. కేసీఆర్‌ నాయకత్వానికి ప్రజల్లో ఎనలేని ఆదరణ ఉందన్నారు. ఫ్లోరోసిస్‌ను నల్లగొండ జిల్లా నుంచి సీఎం కేసీఆర్‌ తరిమికొట్టారు. ఫ్లోరోసిస్‌ను అరికట్టేందుకే మిషన్‌ భగీరథను తీసుకొచ్చారు.సొంత పార్టీపై మాట్లాడి సంచలన ప్రకటనలు చేయడం తప్ప రాజగోపాల్‌ రెడ్డి చేసిందేవిూ లేదన్నారు. మునుగోడును అభివృద్ధి చేయడంలో రాజగోపాల్‌ రెడ్డి విఫలమయ్యారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థం కోసం మాత్రమే ఈ ఉప ఎన్నిక వస్తుందన్నారు. 2023 వరకు కాకుండా రాజగోపాల్‌ రెడ్డిని ముందుగానే ఇంటికి పంపే అవకాశం వచ్చిందని ప్రజలు భావిస్తున్నారని జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. తామంతా ఐక్యంగా ఉన్నామని, సీఎం ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిపిస్తామని తేల్చిచెప్పారు. ఇవాళ్టి నుంచి ఉప ఎన్నికలో గెలిచే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. రాజగోపాల్‌ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు.
4.మళ్లీ విధుల్లోకి ఉపాధిహావిూ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు

` హావిూ నెరవేర్చిన ప్రభుత్వం

హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలోని ఉపాధి హావిూ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉపాధి హావిూ ఫీల్డ్‌ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుంచే ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా అధికారులకు ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశాలు జారీ చేశారు. గతంలో పని చేసిన చోటే 7,305 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్ల విధులు నిర్వర్తించనున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు.


5.తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లలిత్‌

` అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

` 27న సుప్రీం సిజెగా ప్రమాణ స్వీకారం

న్యూఢల్లీి(జనంసాక్షి): భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  సుప్రీంకోర్టు 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారంనాడు నియమించారు. ఈ ఆగస్టు 27వ తేదీ నుంచి ఆయన నియామకం అమలులోకి వస్తుంది. కొత్త సీజేఐ పేరును సిఫారసు చేయాలని కోరుతూ ఆగస్టు 3వ తేదీన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సీజేఐ సెక్రటేరియట్‌కు లేఖ పంపారు. ఆ మరుసటి రోజే సీజేఐ ఎన్‌.వి.రమణ సుప్రీంకోర్టులో సెకెండ్‌ సీనియర్‌ మోస్ట్‌ జడ్జి అయిన యూయూ లలిత్‌ పేరును సిఫారసు చేసారు. ఈనెల 26వ తేదీతో సీజేఐ ఎన్‌వీ రమణ పదవీ కాలం ముగుస్తోంది. అయితే  సీజేఐ లలిత్‌ పదవీ విరమణ వ్యవధి కూడా మూడు నెలల కంటే తక్కువగా ఉంది. 2022 నవంబర్‌ 8న ఆయన రిటైర్‌ కావాల్సి ఉంది. 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పదోన్నతి పొందారు. దీనికి ముందు సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌గా ఆయన ఉన్నారు. యూయూ లలిత్‌ తండ్రి యూఆర్‌ లలిత్‌ సైతం సీనియర్‌ అడ్వకేట్‌. ముంబై హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా ఉన్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన లేఖను సీజేఐ కేంద్ర న్యాయ శాఖకు పంపగా.. అక్కడి నుంచి దాన్ని ప్రధాని కార్యాలయానికి పంపారు. పీఎం మోదీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి పేషీకి వెళ్లింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 49వ సీజేఐగా ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ నియామకానికి అనుమతి ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో 27న ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్‌ లలిత్‌ పదవీ కాలం కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది. నవంబర్‌ 8న ఆయన పదవీవిరమణ కానున్నారు. 1957 నవంబర్‌ 9న జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 1985 డిసెంబర్‌ వరకు బొంబాయి హైకోర్టులో పనిచేసిన ఆయన.. 1986 జనవరి నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు మొదలు పెట్టారు. 2014 ఆగస్టు 13న యూయూ లలిత్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పులు ఇచ్చారు. దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన త్రిపుల్‌ తలాక్‌తోపాటు అనేక కీలక తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.


6.మతసామరస్యానికి ప్రతీక మొహర్రం

` తెలంగాణ అంతటా.. అసైదుల హారతి కాళ్ల గజ్జెల గమ్మతి 

` మొహర్రం రోజు వెల్లివిరుస్తున్న మత సామరస్యం

` హిందూ ముస్లింలు కలిసి జరుపుకుంటున్న ఏకైక పండుగ 

` చాలాచోట్ల హిందువులే మొహర్రం కార్యక్రమ నిర్వాహకులు 

` గణేష్‌ నిమజ్జనం లాంటి హిందూ ఉత్సవాలలో ముస్లింల తోడ్పాటు 

` తెలంగాణ ప్రజలను మతాల వారీగా ఎవరూ చీల్చలేరని నిరూపిస్తున్న పండుగలు 

కరీంనగర్‌ ప్రతినిధి(జనంసాక్షి): మతం ఏదైనా సరే సామూహిక పండుగ సంబరాలకు పెట్టింది పేరు భారతదేశం. గంగా జమున తెహజీబ్‌ సంస్కృతికి ప్రతీక తెలంగాణ. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ పండుగయినా సంబంధిత మతస్తులు మాత్రమే ఘనంగా నిర్వహించుకోవడం మనకు తెలుసు. తెలంగాణాలో మాత్రం ఏ పండుగయినా అన్ని మతస్తులు పరస్పర సహకారంతో జరుపుకుంటూ మతసామరస్యాన్ని చాటుతున్నారు. రంజాన్‌ పర్వదినాలలో హిందువులు ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేయడం, గణేష్‌ నవరాత్రి ఉత్సవాలలో ముస్లింలు పాలుపంచుకోవడం అందరికీ తెలిసిందే. అలాగే నిన్న జరిగిన మొహరం పండుగ కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్ధిల్లుతున్న మతసామరస్యాన్ని మరోసారి చాటిచెప్పింది. వాస్తవానికి మొహరం అనేది సంతోషంతో ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు. ముస్లింలలోని కొన్ని వర్గాలు కూడా మొహర్రం జరుపుకోవడాన్నివ్యతిరేకిస్తాయి.  మొహర్రం అనేది హసన్‌, హుస్సేన్‌ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోక తప్త హృదయాలతో జరుపుకునే కార్యక్రమం. మొహర్రం ఇస్లామిక్‌ కొత్త సంవత్సరం లేదా హిజ్రీ కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనిని ఇస్లామిక్‌ క్యాలెండర్‌, హిజ్రీ క్యాలెండర్‌ అని కూడా పిలుస్తారు. పీర్‌ అంటే మహాత్ములు, ధర్మనిర్దేశకులు అని అర్థం. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా పీర్లు, పీరీలు అనే పేర్లతో చేతి ఆకారం  కలిగిన రూపాలను తయారు చేసి అలంకరించి, ఊరేగించి, పూజిస్తారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటంగా మొహర్రంను అభివర్ణిస్తారు. మొహర్రం పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ హల్బిదా, హల్బిదా అంటూ గుండెలు బాదుకొని రక్తం చిందించుకునే దృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి. ముస్లింలలో ‘దూదేకుల’ వారు ఆటలమ్మ, మారెమ్మ దేవతలను కొలవటం తమ పిల్లలకు ఎఱ్ఱెప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, బాలన్న అనే పేర్లు పెట్టుకోవటమూ అలాగే హిందువులలో కుల్లాయమ్మ, దస్తగిరి, నబీగౌడు, ఫక్కీరప్ప, మస్తాన్‌ రావు, లాలెమ్మ, సేకణ్ణ, సైదల్లీ, సైదులు, హుసేన్‌ దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవటం అలాగే ముస్లింలకు సంబంధించిన ఉరుసులలోనూ పాల్గొనటం, దర్గాలకు, మసీదులకూ వెళ్ళటం, పీర్లను కొలవటం తెలంగాణలో అనాదిగా వస్తోంది. అధికారమే లక్ష్యంగా రాజకీయ స్వార్థంతో ప్రజలను మతాల వారీగా చీల్చాలనుకునే కుట్రదారుల లక్ష్యం తెలంగాణ గడ్డ విూద ఎప్పటికీ నెరవేరదని ప్రతీ పండుగ రోజు ప్రజలే నిరూపిస్తున్నారు. గంగా జమున తెహజీబ్‌ సంస్కృతి వర్ధిల్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి కూడా అభినందనీయం.


7.ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు

వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోనిదని వెల్లడి

న్యూఢల్లీి(జనంసాక్షి):షెడ్యూల్‌ కులాల వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు  బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని న్యాయస్థానం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్‌ మాత్రమే సమస్య పరిష్కరించాలని పేర్కొంటూ ఎస్సీ వర్గీకరణపై ఈ మేరకు తీర్పు ఇచ్చింది. తెలుగు రాష్టాల్ల్రో ఎస్సీ వర్గీకరణకు అనుమతివ్వాలని ఎమ్మార్పీఎస్‌ పిటిషన్‌ వేసింది.సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ 18 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ లేక మాదిగ ఉప కులాలు నష్టపోయాయన్నారు. ఏపీ, తెలంగాణ రాష్టాల్రలో ఏడుగురు లేదా ఎనిమిది మంది జడ్జీల లార్జర్‌ బెంచ్‌ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశామన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని, త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మంద కృష్ణమాదిగ అన్నారు.

8.బూస్టర్‌ డోసుగా కార్బెవ్యాక్స్‌ టీకా

అనుమతించిన కేంద్రం

న్యూఢల్లీి(జనంసాక్షి): కార్బెవ్యాక్స్‌ టీకాను కొవిడ్‌ బూస్టర్‌ డోసుగా వాడేందుకు కేంద్రం అనుమతిచ్చింది. పద్దెనిమిదేళ్లు పైబడి వారికి కార్బెవ్యాక్స్‌ టీకా అందుబాటులోకి రానుంది. గతంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు తీసుకున్న వారికి కార్బెవ్యాక్స్‌ ను బూస్టర్‌ డోస్‌ గా ఇవ్వొచ్చని తెలిపాయి ప్రభుత్వ వర్గాలు. ప్రైమరీ వ్యాక్సినేషన్‌ లో ఇచ్చిన డోస్‌ తో పాటు బూస్టర్‌ డోస్‌ గా వ్యాక్సిన్‌ ఆమోదించడం ఇదే తొలిసారి. వ్యాధి నిరోధక శక్తిపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ కి చందిన కొవిడ్‌ 19 వర్కింగ్‌ గ్రూప్‌ ఇటీవలే చేసిన సిఫారసుల మేరకు ఆమోద ముద్ర వేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. ప్దదెనిమిదేళ్లు పైబడిన వారు కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ రెండో డోసుగా తీసుకున్న డేట్‌ నుంచి ఆరు నెలల తర్వాత ప్రికాషనరీ డోస్‌ గా కార్బెవాక్స్‌ తీసుకోవచ్చని తెలిపింది. కార్బెవాక్స్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌ లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. 


9.వరవరరావుకు శాశ్వత బెయిల్‌ 

` మంజూరు చేసన సుప్రీం ధర్మాసనం

న్యూఢల్లీి(జనంసాక్షి): సామాజిక ఉద్యమకారుడు, విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోర్టు వరవరరావుకు శాశ్వత బెయిల్‌ ను మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బెయిల్‌ ఉత్తర్వులు జారీ చేసింది.  2018లో జరిగిన భీమా కోరేగావ్‌ కేసులో నిందితునిగా ఉన్న విప్లవ రచయిత వరవరరావు ఇప్పటికే పలుమార్లు శాశ్వత బెయిల్‌ కావాలని పిటిషన్‌ వేశారు. కానీ ఆయనకు అనుకూలంగా ఇప్పటివరకూ తీర్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే 82ఏళ్ల వరవరరావుకు తాజాగా శాశ్వత బెయిల్‌ కు అంగీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిరచింది. మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న అభియోగాలతో వరవర రావును 2018 ఆగష్టులో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరీరా, గౌతమ్‌ నవలాఖా, సుధా భరద్వాజ్‌లను పుణెళి పోలీసులు నిర్భందించారు.  అయితే గత కొంతకాలం నుంచి వైద్య కారణాల రిత్యా వరవరరావు తాత్కాలిక బెయిల్‌ లో ఉన్నాడు. అనారోగ్య కారణాల కారణంగా తనకు శాశ్వత బెయిల్‌ కావాలని ఇప్పటికే ఆయన పలుమార్లు కోర్టులో పిటిషన్లు వేశారు. కాగా ఈ నేపథ్యంలోనే వరవరరావుకు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు తెలిపింది.  భీమా కొరెగావ్‌ కేసులో బోంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన ఆరు నెలల బెయిలును పర్మనెంట్‌ బెయిలుగా మార్చింది. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న ట్రయల్‌ కోర్టు అధికార పరిధిలోని ప్రాంతం నుంచి వెలుపలికి వెళ్ళకూడదని షరతు విధించింది. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదని కూడా తెలిపింది.  కేసు దర్యాప్తును ఏ విధంగానూ ప్రభావితం చేయరాదని, సాక్షులతో సంప్రదింపులు జరపకూడదని కూడా వివరించింది. ఆయన వయసు 82 సంవత్సరాలు కావడం, అంతేకాకుండా అనారోగ్య పరిస్థితులు ఉండటం వల్ల వైద్యపరమైన కారణాల మేరకు ఈ బెయిలును మంజూరు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. చికిత్సకు సంబంధించి న వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు తెలియజేయాలని వరవరరావును ఆదేశించింది. అంతకుముందు ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. నారోగ్య కారణాల దృష్ట్యా తనకు పర్మినెంట్‌ మెడికల్‌ బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన కోరారు. జస్టిస్‌ యుయు లలిత్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ సుధాంశు దులియా తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిపి, ఆయన బెయిలును పర్మనెంట్‌ బెయిలుగా మార్చేసింది. 


10.ప్రియాంకకు కరోనా పాజిటివ్‌

అస్వస్థతతో ఇంటికే పరిమితమైన రాహుల్‌

పలువురు కాంగ్రెస్‌ నేతలకు కూడా  కోవిడ్‌ 

న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించారు. గతంలోనూ ఒకసారి ప్రియాంక గాంధీ కోవిడ్‌ బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ రావడం ఇది రెండోసారి. తాను ఐసోలేషన్‌ లో ఉన్నానని, కోవిడ్‌ ప్రొటోకాల్‌ ను పాటిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. యరోవైపు ఆమె సోదరుడు,కాంగ్రెస్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాజస్థాన్‌ లోని అల్వార్‌ పర్యటన రద్దయింది. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సంకల్ప్‌ శిబిరంలో పాల్గొనాల్సి ఉంది. పార్టీ బలోపేతానికి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ అన్ని రాష్టాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని నిలబెట్టకునేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్‌ అధిష్టానం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా రాజస్థాన్‌ పై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈఏడాది మేలో కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగింది. ఈ సభలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈఏడాది జూన్‌ లో కూడా ప్రియాంక గాంధీ కోవిద్‌ బారిన పడ్డారు. ఆసమయంలోనూ ఆమె ఒంటరిగా ఐసోలేషన్‌ ఉండి చికిత్స పొందారు. మరో రెండు నెలలు తిరగకుండానే ఈఏడాదిలో రెండోసారి ప్రియాంక గాంధీకి కరోనా వైరస్‌ సోకింది. ప్రియాంకగాంధీతో పాటు కాంగ్రెస్‌ నేతలు పవన్‌ ఖేరా, ఎంపీ అభిషేక్‌ మను సింఫ్వీు కూడా కోవిడ్‌ బారిన పడిన వారిలో ఉన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నాయకుడు, పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే కూడా తనకు కోవిడ్‌ పాజిటివ్‌ గా నిర్థారణ అయినట్లు ట్విట్టర్‌ లో తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఈడీ విచారణకు వ్యతిరే కంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు వరుసగా కోవిడ్‌ సోకుతుండటంతో పార్టీ నాయకుల్లో ఆందోళన నెలకొంది.


11.ఐబి హెచ్చరికలతో బలగాలు అప్రమత్తం 

హైదరాబాద్‌లో మరింత పటిష్టంగా భద్రత

హైదరాబాద్‌(జనంసాక్షి): పంద్రాగస్టు ఉత్సవాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు నగరంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. ఢల్లీితో పాటు కీలక నగరాలను పాకిస్తాన్‌ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘా పెంచనున్నారు. ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢల్లీిలో పోలీసులు ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇంటెలిజెన్స్‌ అధికారుల హెచ్చరికలతో 10వేలమందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వాతంత్య దినోత్సవ వేడుకలు జరిగే ఎర్రకోట చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలపై షూటర్లను మోహరించడంతో పాటు నో ప్లయింగ్‌ జోన్లు అమలు చేస్తున్నారు. గాలి పటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా నిషేధం విధించగా.. నగరవ్యాప్తంగా వెయ్యికిపైగా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిభద్రతను పర్యవేక్షిస్తున్నారు.


12.ఎగువన వర్షాలతో మళ్లీ పెరుగుతున్న వరద

కృష్ణా,గోదావరి నదులకు పెరుగుతున్న ప్రవాహం

శ్రీశైలం 8గేట్లు ఎత్తివేత..సాగర్‌లోకి కొనసాగుతున్న నీటిరాక

భద్రాచలం వద్ద కొనసాగుతున్న నీటి పెరుగుదల

హైదరాబాద్‌(జనంసాక్షి): కృష్ణా,గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహాం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలాన్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరుగు తుండటాన్ని బట్టి నాగార్జునసాగర్‌ గేట్లు గురువారం తెరచుకునే అవకాశాలున్నాయి. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి భీకర రూపం దాల్చుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.ఎగువన వర్షాలతో కృష్ణా గోదావరి నదుల్లో ఉద్ధృత ప్రవాహం నమోదవుతోంది. కృష్ణానదికి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయం గేట్లను ఒక్కోటి పెంచుతూ మంగళవారం రాత్రికి ఎనిమిదింటిని తెరిచారు. ఏపీ, తెలంగాణ ఉత్పత్తి కేంద్రాల ద్వారా జలవిద్యుత్‌ను తయారు చేస్తున్నారు. జలాశయం నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. నారాయణపూర్‌ నుంచి 1.46 లక్షల, తుంగభద్ర డ్యాం నుంచి 1.59 లక్షల క్యూసెక్కులు విడుదలవుతుండగా ఇవి మరింత పెరిగే సూచనలున్నాయి.మరోవైపు నాగార్జునసాగర్‌ వద్ద 1.83 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఎª`లో నమోదవుతోంది. మంగళవారం సాయంత్రానికి ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు 578.20 అడుగుల వద్ద ఉంది. 589.50 అడుగులకు చేరుకున్నాక గేట్లు తెరవాలని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటాన్ని బట్టి గురువారం గేట్లు తెరచుకునే అవకాశాలున్నాయి. గతేడాది ఆగస్టు నెలలోనే సాగర్‌ గేట్లు తెరచుకున్నాయి. కృష్ణానదికి భారీ వరదలు వచ్చినపుడు తప్ప మరెప్పుడూ ఆగస్టులో గేట్లు తెరచుకున్న దాఖలాలు లేవు. గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల్లో లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) వద్ద 7.30 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన మానేరు ఇతర ఉపనదులు, వాగులతోపాటు ప్రాణహిత నుంచి వస్తున్న వరదతో మేడిగడ్డ నుంచి దిగువకు పెద్దఎత్తున ప్రవాహం వెళ్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం సవిూపంలో జాతీయ రహదారిని వరద ముంచెత్తడంతో ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచి పోయాయి.మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి భీకర రూపం దాల్చుతోంది. అర్ధరాత్రి ఒంటి గంటకు 48 అడుగులకు చేరిన నీటిమట్టం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.ఉదయం 11 గంటలకు గోదావరి నీటిమట్టం 50.3 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక అమల్లోకి రానుంది. గోదావరిలోకి ఎగువ నుంచి 12.72 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది ఒడిశాపై కేంద్రీకృతమై ఉంది. రుతుపవనాల ద్రోణి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి వాయుగుండం ఏర్పడిన ప్రాంతం వరకూ వ్యాపించింది. తెలంగాణలో బుధ, గురువారాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని, అక్కడక్కడ ఒక మోస్తరుగా కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ..రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లిలో 4.3, డిచ్‌పల్లిలో 3.9, సాలూరలో 3.3, చిమ్నంపల్లిలో 3.3, నిజామాబాద్‌లో 3.2 సెంటీవిూటర్ల వంతున వర్షం కురిసింది. భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ఉధృతి పెరిగింది. భద్రాచలం దగ్గర 49.3 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.  ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చురికలు జారీ చేశారు. వరద ప్రభావంతో భద్రాచలం నుంచి దమ్ముగూడెం, చర్ల, వెంకటాపురానికి బస్సులను బంద్‌ చేశారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి ప్రస్తుతం జలాశయానికి 1,75,272లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 31,849 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 580 అడుగుల మేర నీరున్నది. డ్యామ్‌ గరిష్ఠ నిల్వసామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 283.01.60 టీఎంసీల మేర నిల్వ ఉన్నది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 25,818 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు 2570 క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.14.విమాన టికెట్‌ ధరలపై పరిమితులు ఎత్తివేత

` కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం 

దిల్లీ(జనంసాక్షి): విమాన టికెట్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై పరిమితులను తొలగించింది.ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేడు ట్విటర్‌ వేదికగా వెల్లడిరచారు. ఈ నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానుంది. అంటే ఇకపై, ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు.విమాన ఇంధన ధరలు, రోజువారీ ప్రయాణికుల డిమాండ్‌ వంటి అంశాలను విశ్లేషించిన అనంతరం విమాన ఛార్జీల పై పరిమితులను తొలగించాలని నిర్ణయించినట్లు పౌరవిమానయాన మంత్రి సింధియా తెలిపారు. పౌరవిమానయాన రంగంలో స్థిరీకరణ మొదలైందని, రానున్న రోజుల్లో దేశీయంగా ఈ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కొవిడ్‌ కారణంగా రెండు నెలలు లాక్‌డౌన్‌ తర్వాత 2020 మే నెలలో దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమైనప్పుడు.. దేశీయ మార్గాల్లో ఛార్జీల (ంతితీ ఈజీతీవబ)పై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను విధించిన విషయం తెలిసిందే. తక్కువ ఛార్జీల వల్ల విమానయాన సంస్థలు నష్టపోకుండా, గిరాకీకి అనుగుణంగా సంస్థలు భారీగా ఛార్జీలు పెంచకుండా చూడటం ద్వారా ప్రయాణికులకు ఊరట కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణ సమయాన్ని బట్టి వీటిని నిర్ణయించారు. 40 నిమిషాల్లోపు వ్యవధి ఉండే ప్రయాణాలకు రూ.2,900`8800 (జీఎస్‌టీ మినహాయించి) ఛార్జీ నిర్ణయించారు.అయితే, ఇప్పుడు విమానయాన రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. కొత్త నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే, విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టు యాజమాన్యాలు కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ప్రయాణ సమయాల్లో ప్రజలు నిబంధనలు పాటించేలా చూసుకోవాలని ఆదేశించింది.గత కొంతకాలంగా, విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. 2019`20 లో ఏటీఎఫ్‌ ధర కిలో లీటరుకు రూ. 53,000 కాగా.. ప్రస్తుతం రూ. 1.20 లక్షలకు చేరింది. కొవిడ్‌ ముందుతో పోలిస్తే ఈ ధర రెట్టింపు కావడంతో విమాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఛార్జీలపై పరిమితులు ఎత్తివేయడంతో ఎయిర్‌లైన్లు ప్రయాణికులను పెంచుకునేందుకు టికెట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించుకునే అవకాశముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.


15.సెంట్రల్‌ ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 

13 మంది పౌరులు మృతి

కీవ్‌(జనంసాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. సెంట్రల్‌ ఉక్రెయిన్‌లో డ్నిప్రోపెట్రోవ్స్క్‌ ప్రాంతంలో రష్యా జరిపిన దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం స్థానిక గవర్నర్‌ వాలెంటిన్‌ రెజ్నిచెంకో తెలిపారు. ఈ భయంకరమైన రాత్రి. దాడుల్లో 11 మంది మరణించారు’ అని టెలిగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత మరికొద్ది సేపటికే మరో ఇద్దరు మృతి చెందారంటూ తెలిపారు. మరో వైపు జపోరిజ్జియా అణు విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి డ్నీపర్‌ నదికి అవతలి వైపున మార్గానెట్స్‌లో జరిగిన దాడుల్లో 12 మంది మృతి చెందారని ప్రాంతీయ కౌల్సిల్‌ హెడ్‌ మైకోలా లుకాషుక్‌ పేర్కొన్నారు.దాడుల్లో అడ్మినిస్ట్రేటివ్‌ భవనాలు దెబ్బతిన్నాయని, పాఠశాల, సాంస్కృతిక భవనం, నగర మండలి భవనం దెబ్బతిన్నాయని తెలిపారు. పట్టణంలో విద్యుత్‌ లైన్లు దెబ్బతిన్నాయని, కేవల మందికి కరెంటు సదుపాయం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని అమెరికా ప్రకటించింది. రాకెట్లు, మందుండు సామగ్రి, ఇతర ఆయుధాలను యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ నేరుగా ఉక్రెయిన్‌ సాయుధ దళాలకు పంపిణీ చేస్తున్నది.