1.వజ్రోత్సవ వేళ కేసీఆర్ వరాల జల్లు
` తెలంగాణలో పదిలక్షల కొత్త పెన్షన్లు
` ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ
` రాష్ట్రంలో 5111 అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీ
` 21న నిర్వహించ తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల సమావేశాలు రద్దు
` ఈ ఏడాది రాష్ట్ర ఆదాయంలో 15.3 శాతం వృద్ధి నమోదు
` 16న సామూహిక జాతీయగీతాలాపన
` ఎక్కడి వారు అక్కడే నిలబడి సెల్యూట్ చేయాలి
` వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల
` తెలంగాణ కేబినెట్ భేటిలో పలు కీలక నిర్ణయాలు
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో దాదాపు 5గంటలకు పైగా సాగిన కేబినెట్ సమావేశం సాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 36 లక్షల ఆసరా పింఛన్లకు అదనంగా కొత్తగా మరో 10 లక్షల పింఛన్లు ఇవ్వాలని మంత్రి వర్గం తీర్మానించింది. ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈనెల 21న నిర్వహంచ తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నందున ప్రజాప్రతినిధుల నుంచి వినతులు రావడంతో ప్రత్యేక సమావేశాల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 5,111 అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గ భేటీలో సమగ్ర చర్చ జరిగింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయంలో15.3 శాతం వృద్ధి నమోదైందని అధికారులు వివరించారు. కేంద్రం నిధులు తగ్గినా వృద్ధిరేటు నమోదు గమనార్హమని ఈ సందర్భంగా సీఎం అన్నారు. రాష్ట్ర నోడల్ ఖాతాలు అనే కొత్త పద్ధతితో రాష్ట్రాలకిచ్చే నిధుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల్లో కోతలు విధించారని, కోతలు లేకుంటే ఆదాయం పెరిగేదని.. వృద్ధిరేటు 22శాతం నమోదయ్యేదని పేర్కొన్నారు. సీఎస్‌ఎస్‌లో 8 ఏళ్లలో రూ.47,312 కోట్లు మాత్రమే వచ్చాయని ఆర్థికశాఖ అధికారులు వెల్లడిరచారు. నాలుగేళ్లలో రైతు బంధుకు రూ.58,024 కోట్లు ఇచ్చామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014`15లో రాష్ట్రం యొక్క ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి 1 లక్షా 84వేల కోట్లు వరకు పెరగడం జరిగింది. అంటే ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచింది..అని ఆర్థిక శాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.ఐటీ రంగంలో గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించి, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ కేబినెట్ కు తెలిపారు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగలూరు నగరంలో 1 లక్షా 48 వేల ఉద్యోగాలు కల్పన చేయగా, హైదరాబాద్ అంతకంటే ఎక్కువగా 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఐటీ అధికారులు వివరించారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్ లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక వసతుల కల్పన, సుస్థిర శాంతిభద్రతలు, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా, మానవ వనుల లభ్యత వల్ల ఐటీ రంగం లో అభివృద్ది సాధ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగా...రాష్ట్ర ఐటీరంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను, ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ ను, ఇతర అధికారులను ప్రశంసించారు.
16న సామూహిక జాతీయగీతాలాపన
దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మొత్తం 15 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఆగస్టు 08వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకొకటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈనెల 08వ తేదీన సీఎం కేసీఆర్ వేడుకలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న ఉదయం 11గంటల 30 నిమిషాలకు జాతీయ గీతాలాపన నిర్వహించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. వచ్చే మంగళవారం ఉదయం ప్రభుత్వం చెప్పిన టైమ్ కు ఎక్కడివారు అక్కడే ఉండి జాతీయ గీతాలాపన చేయాలని ఆదేశించింది. వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం 5 కె రన్ నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఈ రన్ జరిగింది. 12న జాతీయ సమాఖ్య రక్ష బంధన్ నిర్వహిస్తారు. 13వ తేదీన ఎన్.సి.సి, స్కాట్స్ అండ్ గైడ్స్, విద్యార్థులు అధికారులు ప్ల కార్డులతో పాటు జాతీయ పతాకాలు పట్టుకుని ర్యాలీ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ట్రై కలర్ బెలూన్లను ఎగుర వేస్తారు. 14వ తేదీన జానపద కళాకారుల ప్రదర్శన జరుగనుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. జాతీయ స్పూర్తి ఉట్టిపడేలా ట్యాంక్ బండ్ పై బాణాసంచా కాల్చనున్నారు. 15వ తేదీ వేడుకలు ప్రధాన కార్యాలయాల్లో నిర్వహిస్తారు. సర్కిల్ వార్డు, జోనల్ స్థాయి, కాలనీల వారీగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయనున్నారు. ఒకేసారి నిర్దేశిరచిన సమయంలో ఆలాపన జరుగనుంది. 17వ తేదీన రక్త శిబిరాలు నిర్వహిస్తారు. 18వ తేదీన ఫ్రీడమ్ కప్ క్రీడలు, 19వ తేదీన అధికారుల గ్రామాల పర్యటన, పేదలకు పండ్ల పంపిణీ. 20వ తేదీన రంగోలి, 21వ తేదీన సమావేశాలు, 22వ తేదీన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగనుంది.
2.పేదలకు పన్నుల భారం..సంపన్నులకు మాఫీలు..
` మోదీ సర్కారు తీరుపై కేజ్రీవాల్ ఫైర్
దిల్లీ(జనంసాక్షి): గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తోన్న వేళ..ఉచిత హావిూలు, పథకాలపై భాజపా, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రధాని మోదీపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన.. పేదవాళ్లపై పన్నుల భారం మోపుతూ, ధనికులకు మాత్రం భారీ స్థాయిలో రుణ మాఫీలు చేస్తోందని ఆరోపించారు.’2014లో కేంద్ర బడ్జెట్ రూ.20లక్షల కోట్లు. ప్రస్తుతం అది రూ.40లక్షల కోట్లకు చేరింది. అందులో దాదాపు రూ.10లక్షల కోట్లు సంపన్నులు, వారి మిత్రుల రుణాలను మాఫీ చేయడానికే ఖర్చు చేస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలకు కూడా రూ.5లక్షల కోట్లను ఈ ప్రభుత్వం మాఫీ చేసింది. అటువంటి రుణాలను మాఫీ చేయకుంటే.. పేద ప్రజల అన్నంపై పన్ను విధించే పరిస్థితి వచ్చేదే కాదు’ అని కేంద్ర ప్రభుత్వంపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో పేదరికంతో యాచించే వారు కూడా బియ్యం, గోధుమలు కొనాలన్నా పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇలా అత్యంత పేదలపైనా పన్నుల భారం మోపుతోందంటే కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
’రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వచ్చే వాటిలో కొంత మాత్రమే రాష్ట్రాలకు ఇస్తుంది. అంతకుముందు 42శాతం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు అది 29`30శాతానికి పడిపోయింది. 2014తో పోలిస్తే ఇప్పుడు రెండు, మూడు రెట్లు అదనంగా పన్నులను కేంద్రం వసూలు చేస్తోంది. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది..?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. సైనికులకు పెన్షన్లు చెల్లించేందుకు డబ్బులు లేవంటూ అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారన్న ఆయన.. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఫించన్లకు డబ్బులు లేవని చెప్పడం ఇదే తొలిసారి అని విమర్శించారు.
3.కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణ ఆపండి
` భాజపాకు ఈసీ మొట్టికాయ..
` సాలు దొర.. సెలవు దొర.. ప్రచారంపై అభ్యంతరం
న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా.. చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భాజపాను ఆదేశించింది. సాలు దొర సెలవు దొర పేరిట సాగించే ప్రచారంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాలు దొర.. సెలవు దొర.. ప్రచారంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి బొమ్మతోపాటు ఈ నినాదాన్ని కలిపి పోస్టర్లుగా ముద్రించడానికి అనుమతి నిరాకరించింది. సాలు దొర.. సెలవు దొర.. ప్రచారానికి అనుమతి కోరుతూ భారతీయ జనతా పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్‌ను సంప్రదించారు. ఈ దరఖాస్తును.. విూడియా సర్టిఫికేషన్ కమిటీ తిరస్కరించింది.రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫొటోలు, రాతలు ఉండకూడదని కమిషన్ తేల్చిచెప్పింది. 2019 ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ఆదేశాలతో విూడియా సర్టిఫికేషన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఎన్నికలు జరిగే రాష్టాల్లో పార్టీలు చేసే ప్రచారానికి సంబందించిన అన్ని విషయాలపై సర్టిఫికేషన్ కమిటీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని ధిక్కరిస్తే.. కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.
4.ప్రతీ మహిళకు పెద్దన్న కేసీఆర్
` రాఖీ పౌర్ణమి సందర్భంగా కేటీఆర్ భరోసా
` పండుగ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ కట్టాలి
` అమ్మ ఒడి ఎక్కడా లేని పథకం.. ప్రభుత్వ ఆస్పత్రలు బలోపేతం
` సహజ ప్రసవాలను ప్రతోహించేలా చర్యలు
` ఇప్పటివరకు 13.30 లక్షల మందికి కేసీఆర్ కిట్లు
` వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో జూమ్ మీటింగ్‌లో కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి):ఎల్లవేళలా సోదరికి అండగా నిలుస్తానని సోదరుడు చేసే ప్రమాణానికి ప్రతీకే రక్షాబంధన్ అన్నారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారకరామారావు. రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఉజ్వల భవిష్యత్తును కల్పించే పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా ఉన్నారని చెప్పారు. అందుకే రాఖీ పండుగ నాడు కేసీఆర్ చిత్రపటానికి ఆడబిడ్డలంతా రాఖీకట్టాలని కోరారు. రాఖీ పండుగను పురస్కరించుకొని 33 జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో జూమ్ కాల్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ హయాంలో పెన్షన్ పదిరెట్లు పెరిగిందన్న కేటీఆర్ , 14 లక్షల ఒంటరి, వితంతు మహిళలతో పాటు నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి అర్హులైన మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు 2,016 రూపాయల చొప్పున పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమని నమ్ముతున్న ప్రభుత్వం తమది అని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉద్యమకాలం నుంచి తమకు అండగా ఉన్న మహిళల ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. శిశువుల నుండి వృద్ధుల వరకు ప్రతీ స్త్రీ కి అండగా ఉండి వారి అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములుగా ఉన్నామని చెప్పుకునేందుకు గర్వంగా ఉందన్నారు. అమ్మ ఒడి పథకంలో భాగంగా గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా 300 ఆంబులెన్స్ లు ఏర్పాటుచేసిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. అమ్మ ఒడి పథకంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 10 లక్షల 85 వేల గర్భిణీలకు ప్రయోజనం కలిగిందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటివరకు 13 లక్షల 30 వేల మంది బాలింతలకు 2 వేల రూపాయల విలువైన కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. ప్రసవం తరువాత ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మహిళలు శారీరక శ్రమ చేయకూడదన్న ఉద్దేశ్యంతో ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు, మగబిడ్డ పుడితే 12 వేల రూపాయల పారితోషకం ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కిట్స్ తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు డెలివరీలు పెరిగాయన్నారు. మాతాశిశు మరణాల తగ్గింపులో దేశం మొత్తంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకుందన్నారు. సిజేరియన్ లను తగ్గించాలన్న లక్ష్యంతో సహజ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి 3వేల రూపాయల అదనపు ప్రోత్సాహకం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తమ ఆడపడుచుల ఆరోగ్యం, సంక్షేమం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి తమ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి`షాదీ ముబారక్ పథకం లో భాగంగా లక్షా నూట పదహారు రూపాయలను కట్నంగా ఇస్తుందన్నారు కేటీఆర్. తల్లిదండ్రులకు అమ్మాయి పెళ్లి భారం కావద్దని ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి`షాదీ ముబారక్ పథకం తో 12 లక్షల 87 వేల 588 మంది వధువులకు నగదు సాయం అందించామన్నారు. ఆరోగ్య లక్ష్మి కింద సుమారు 5 లక్షల (5, 18,215) శిశువులకు, 21లక్షల (21, 58,479) గర్భిణీ స్త్రీలకు, 18 లక్షల (18, 96,844) పాలిచ్చే తల్లులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 4 లక్షల స్వయం సహాయక బృందాలకు తమ ప్రభుత్వం నిరంతరం మద్దతు అందిస్తోందన్న కేటీఆర్, అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల్లో కేంద్రం తన కోటా తగ్గించుకున్నా కూడా అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల జీతాలను తాము పెంచామని తెలిపారు. కంటివెలుగు తో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలను ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద ములుగు, సిరిసిల్ల జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ సిద్దం చేస్తామన్నారు. మిషన్ భగీరథతో ఆడబిడ్డల నీటి కష్టాలను పూర్తిగా తొలగించామన్న కేటీఆర్, ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెంచామన్నారు. 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలను ఏర్పాటుచేసి పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. పిల్లలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ముందుగా తల్లులే తల్లడిల్లుతారని, అందుకే పిల్లల వైద్యం విషయంలో మాతృమూర్తులు ఎలాంటి ఆందోళన చెందకూడదన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 4లక్షల 30 వేల పైచిలుకు ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను ఇచ్చి ఆర్థికంగా భరోసా నిలిచామని కేటీఆర్ చెప్పారు. మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆడబిడ్డల తాగునీటి కష్టాన్నీ మిషన్ భగీరథతో పూర్తిగా తీర్చామన్న కేటీఆర్, మన స్పూర్తితోనే దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ ను కేంద్రం ప్రారంభించిందని గుర్తుచేశారు. మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే ఉద్దేశ్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా వీ హబ్ ని ఏర్పాటుచేశామన్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల, డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేసి ఆడపిల్ల విద్య భారంగా మారకుండా చూస్తున్నామన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. చట్టసభల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లును తేవాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను స్త్రీలకే కేటాయించడంతో పాటు మహిళల పేరుతోనే ఇండ్ల పట్టాలను ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. సుసంపన్నమైన సమాజ నిర్మాణ రూపకర్తలు స్త్రీలే అని తమ ప్రభుత్వం భావిస్తోందన్న కేటీఆర్, అన్ని రంగాల్లో మహిళలకు సరైన అవకాశాలు దక్కేలా, వారి ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒక్క ఆడబిడ్డ బాగుంటే మొత్తం కుటుంబం, మొత్తం సమాజం మంచిగుంటదన్న లక్ష్యంతోనే మహిళా సంక్షేమాన్ని కర్తవ్యంగా భావించి పనిచేస్తున్నామన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్న పలువురు లబ్ధిదారులు మంత్రి కేటీఆర్ తో సంభాషించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తమకు కలిగిన భరోసాను వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. రాఖీ పండుగకు పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ తమతో ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం తమకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ పథకాల వలన తమకు కలిగిన లబ్ధి మరియు వాటి ప్రయోజనాలను వివరిస్తూ పలువురు మహిళలు ఉద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, కేసిఆర్ కిట్ పథకాలు తమ జీవితాల్లో అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల వలన అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద వర్గాలకు చెందిన తమకు కష్టాలు రాకుండా అండగా నిలబడ్డాయని తెలిపారు.
5.ఖేల్ ఇండియా నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం
` పతకాలు సాధించిన తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ
` కేంద్రం తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
హైదరాబాద్(జనంసాక్షి): ఖేలో ఇండియాకు కేటాయించిన నిధుల కేటాయింపులతో తెలంగాణకు తీవ్రఅన్యాయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కేంద్ర ప్రభుత్వ వివక్షను ఎండగట్టారు. ఖేలో ఇండియాకు కేటాయించిన నిధులపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన తెలంగాణకేమో నిధులు తక్కువ కేటాయిస్తారు. అసలు పతకాలే తీసుకురాలేని గుజరాత్‌కేమో దేశంలోనే అత్యధికంగా నిధులు కేటాయించారని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధుల పంపిణీలో ఫెడరల్ స్ఫూర్తి ఏంటంటే.. రాష్టాల్ర పట్ల ఎలాంటి పక్షపాతం చూపెట్టకూడదు. అన్ని రాష్టాల్రు ఒక్కటే. అది ఏ పార్టీ అధికారంలో ఉందన్న దానితో సంబంధం లేదు. కానీ క్రీడల రంగంలో నిధుల కేటాయింపును చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. క్రీడా మంత్రిత్వ శాఖలో గణనీయమైన నిధులు ఖేలో ఇండియాకు ఇచ్చారు. ఖేలో ఇండియా నిధుల కేటాయింపు గురించి ఆగస్టు 2న పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఒక సమాధానం రాసి ఇచ్చింది. ఖేలో ఇండియా కింద తెలంగాణకు రూ. 24 కోట్లు కేటాయించారు. కానీ గుజరాత్‌కు రూ. 608 కోట్లు కేటాయించారు. గుజరాత్‌కు కేటాయించిన నిధులతో పోల్చితే తెలంగాణకు కేటాయించింది కేవలం 4 శాతం మాత్రమే.ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడలకు గుజరాత్ నుంచి ఎంత మంది వెళ్లారు. అక్కడ్నుంచి ఐదు మంది అª`లథెట్స్ వెళ్లినట్లు ఉన్నారు. కానీ తెలంగాణ నుంచి వెళ్లిన బృందంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక మెడల్ సాధించారు. మరి గుజరాత్ నుంచి వెళ్లిన క్రీడాకారులు ఎన్ని మెడల్స్ తెచ్చారు? నిధులేమో అత్యధికం.. మెడల్స్ సాధించడంలో అతి తక్కువ. మరి ఎందుకని ఇంత భారీ ఎత్తులో గుజరాత్‌కు నిధులు కేటాయిస్తున్నారు. అది మోదీ, అమిత్ షా స్వరాష్ట్రం అని నిధులు కేటాయిస్తున్నారా? బీజేపీ పాలించని రాష్టాల్రకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. తెలంగాణకు రూ. 24 కోట్లు, ఏపీకి రూ. 34 కోట్లు, తమిళనాడు కు రూ. 33 కోట్లు, కేరళకు రూ. 62 కోట్లు కేటాయించారు. సౌత్ ఇండియాలో బీజేపీ పాలించని ఈ రాష్టాల్రకు మొత్తంగా రూ. 154 కోట్లు కేటాయించారు. బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకకు రూ. 128 కోట్లు కేటాయించారు. మొత్తం కర్ణాటకతో సహా ఐదు దక్షిణ రాష్టాల్రను చూస్తే రూ. 280 కోట్లకు పైగా కేటాయించారు. ఉత్తరాది రాష్టాలైన్ర గుజరాత్‌కు రూ. 608 కోట్లు, యూపీకి రూ. 500 కోట్లకు పైగా కేటాయించారు. ఒక్క గుజరాత్‌కే అన్ని నిధులు ఎందుకుకేటాయించారో సమాధానం లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌కు రూ. 110 కోట్లు, మహారాష్ట్రకు రూ. 111 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూసుకున్నప్పుడు బీజేపీ పాలిత రాష్టాల్రకు పెద్దపీట, అందులో మోదీ, అమిత్ షా స్వరాష్టాన్రికి ఇంకా పెద్దపీట వేశారు. రెండో అంశం ఏంటంటే నార్త్ ఇండియన్ స్టేట్స్‌కు ఒక రకమైన నిధులు కేటాయిస్తే, సౌత్ ఇండియన్ స్టేట్స్‌కు మరో రకంగా నిధులు కేటాయించారు. నిధుల కేటాయింపులో వివక్షత చూపిస్తే దేశ సమైక్యత, సమ్రగతకు ప్రమాదం కలుగుతుందని నాగేశ్వర్ పేర్కొన్నారు.
6.మనుగోడు ఉపఎన్నిక మాకు కీలకం
హైదరాబాద్(జనంసాక్షి):మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అనుబంధ సంఘాల పాత్ర చాలా కీలకమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికతోపాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు పట్టుదలతో పనిచేయాలని కోరారు.ఈ మేరకు గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన అనుబంధ సంఘాల ఛైర్మన్‌ల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ‘’కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నిక చాలా కీలకం. మనం పూర్తి స్థాయిలో కష్టపడి భాజపా, తెరాసలకు బుద్ధి చెప్పాలి. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారికి గుణపాఠం చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పని చేయాలి’’ అని పార్టీ శ్రేణులకు సూచించారు.భాజపా, తెరాస కుట్రలో భాగంగానే ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను పక్కనపెట్టి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస, భాజపాల మధ్యే పోటీ ఉందనే వాతావరణం తెచ్చేందుకు ఇరు పార్టీలు ఒప్పందంతో కొనసాగుతున్నాయన్నారు. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ సెవిూఫైనల్‌గా భావిస్తుందని.. ఈ పరిణామాలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సైతం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా కార్యకర్తలందరికీ ఆమోదయోగ్యమైన వారే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటారని తెలియజేశారు.’’ఈనెల 13న మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. నియోజకవర్గ పరిధిలోని 175 గ్రామాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. 16 నుంచి మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తాం. ఈనెల 20న జరిగే రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర నేతలంతా పాల్గొంటారు’’ అని మధుయాస్కీ తెలిపారు.
7.తెలంగాణ ఉప్పుడు బియ్యానికి కేంద్రం ఓకే
న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2021`22 రబీ సీజన్‌లో పండిరచిన 8లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. గతంలో ఇచ్చిన 6.05లక్షల మెట్రిక్ టన్నులకు అధనంగా బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు కేంద్రం లేఖలో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌సీఐ చర్యలు తీసుకుంటుందని వెల్లడిరది. ఉప్పుడు బియ్యం విషయంలో కేంద్ర నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో పాటు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి పియూష్ గోయల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కిషన్‌రెడ్డి ప్రకటనను విడుదల చేశారు.
8.నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈనెల 12న శుక్రవారం విడుదల కానున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను ఉదయం 11 గంటలకు జెఎన్‌టీయూలో విడుదల చేస్తారు. గత నెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్, 30, 31వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ పరీక్ష జరిగింది. ఇంజినీరింగ్ ఎగ్జామ్ కు 1,56,812 మంది హాజరయ్యారు. 80 వేల 575 మంది అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం పరీక్ష రాశారు. ఇప్పటికే ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించింది. ఫలితాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. వాస్తవానికి ఎంసెట్ పరీక్ష జూలై 14, 15వ తేదీల్లో నిర్వహించాల్సి ఉండే. భారీ వర్షాల కారణంగా జూలై 18, 19, 20వ తేదీల్లో రెండు విడతలుగా పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన అనంతరం మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్ లైన్ లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వేరిఫికేషన్ అనంతరం వెబ్ ఆఫ్షన్లు ఇస్తారు. అనంతరం సీట్ల కేటాయింపు ఉండనుంది.
9.యమునా నదిలో 35మందితో పడవ బోల్తా..
`నలుగురి మృతి.. ముమ్మర గాలింపు
లఖ్‌నవూ(జనంసాక్షి):రాఖీ పండుగ వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో బాందా జిల్లాలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదం సమయంలో పడవలో దాదాపు 30 నుంచి 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు వెల్లడిరచారు.మర్క నుంచి ఫతేపూర్ జిల్లాలోని జారౌలి ఘాట్‌కు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీసినట్టు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పడవలో రాఖీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎగువన కురిసిన వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ప్రమాదం సమయంలో పడవలో 30`35మంది ఉన్నట్టు ఎస్పీ అభినందన్ తెలిపారు. గల్లంతైన వారి కోసం డైవర్ల సాయంతో గాలిస్తున్నట్టు తెలిపారు. అదనపు ఎస్పీ లక్ష్మీ నివాస్ మిశ్రా మాట్లాడుతూ.. ఏడెనిమిది మంది ఈదుకుంటూ సురక్షితంగా బయటకు వచ్చేశారని.. మిగతా వారంతా మునిగిపోయారన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.బలమైన గాలులు వీడయం వల్లే బోటు మునిగిపోయిందని బాందా ఎస్పీ అభినందన్ వెల్లడిరచారు. ఇప్పటివరకు 15మందిని సురక్షితంగా కాపాడామని.. 17మంది గల్లంతయ్యారన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయన్నారు.ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తంచేశారు. స్థానిక ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన వైద్యసాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
10.నిరుద్యోగం, ధరల పెరుగుదలను గుర్తించని ప్రధాని
ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన రాహుల్
న్యూఢల్లీి(జనంసాక్షి): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చేతబడి వంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడుతూ ప్రధాన మంత్రి పదవికిగల ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని దిగజార్చవద్దని హితవు పలికారు. రాహుల్ గాంధీ గురువారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ప్రధాని మోదీ దేశంలోని నిరుద్యోగం, పెరుగుతున్న ధరలను గుర్తించలేక పోతున్నారా? అని ప్రశ్నించారు. మోదీ గారూ, విూ చీకటి పనులను మరుగుపరచడం కోసం చేతబడి వంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడటం ద్వారా ప్రధాన మంత్రి పదవికి ఉన్న ఔన్నత్యం, హుందాతనాలను దిగజార్చకండి అని హితవు పలికారు. ప్రజల సమస్యలపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేతలు ఈ నెల 5న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు నల్ల దుస్తులు ధరించారు. దీనిపై మోదీ బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, కాలా జాదూను నమ్మేవారు ప్రజల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోలేరని విమర్శించారు. బ్లాక్ మ్యాజిక్ మెంటాలిటీని వ్యాపింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నల్ల దుస్తులు ధరించడం వల్ల నైరాశ్యపు రోజులు ముగిసిపోతాయని భావించేవారు ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందలేరన్నారు. బ్లాక్ మ్యాజిక్, మూఢ నమ్మకాలను తాము నమ్మినప్పటికీ, ప్రజల్లో తమపై నమ్మకం తిరిగి రాదని వారికి తెలియడం లేదన్నారు. హర్యానాలోని పానిపట్‌లో రూ.900 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండో తరం ఇథనాల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయడం కోసం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు.
11.ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కర్ ప్రమాణం
రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము
హాజరైన ప్రధాని మోడీ,కేంద్రమంత్రులు, విపక్ష నేతలు
భైరాన్‌సింగ్ షెకావత్ తరవాత రెండో వ్యక్తిగా ధన్‌కర్
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఢల్లీిలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, సుబ్రహ్మణ్యం జైశంకర్ విపక్ష నేతలు, ఎంపీలు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన జగదీప్ ధన్కర్ ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాపై విజయం సాధించారు. 1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్ సైనిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జనతాదళ్ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో రaుంరaును స్థానం నుంచి జగదీప్ ధన్‌కర్ ఎంపీగా విజయం సాధించారు. 1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించింది. జగదీప్ ధన్‌కర్ రాజస్థాన్ హైకోర్టు బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో మెంబర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్ల పాటు సుప్రీం కోర్టులోనూ పని చేశారు. రాజస్థాన్నుంచి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనవారిలో జగదీప్ ధన్‌కర్ రెండోవారు. 2002 నుంచి 2007 వరకు ఆ రాష్టాన్రికి చెందిన భైరాన్ సింగ్ షెకావత్ ఈ పదవిని నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన ధన్‌కర్ ఎన్డీయే అభ్యర్థిగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ చేశారు. చెల్లుబాటైన 710 ఓట్లలో 528 ఓట్లు ధన్‌కర్‌కు లభించాయి. మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు లభించాయి. జగదీప్ ధన్‌కర్ అంతకుముందు ఢల్లీిలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈసారి లోక్‌సభ సభాపతి ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ పదవులను నిర్వహిస్తున్న ఇద్దరూ రాజస్థాన్‌కు చెందినవారే కావడం విశేషం.
తనకు తెలంగాణ విూడియా అకాడెవిూ చైర్మన్ గా మరోసారి అవకాశం కల్పించినందుకు, ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్న అల్లం నారాయణ.
` హైదరాబాద్, జనంసాక్షి
12.శశిథరూర్‌కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘లిజియన్ ఆఫ్ హానర్’ దక్కింది.ఆయన ప్రసంగాలు, రచనలకు గుర్తింపుగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. 1802లో నెపోలియన్ దీన్ని నెలకొల్పారు. ‘ఫ్రాన్స్‌తో భారత్ సంబంధాలను గౌరవించే, భాషను ప్రేమించే, సంస్కృతిని ఆరాధించే వ్యక్తిగా.. ఈ గుర్తింపును పొందడం గౌరవంగా భావిస్తున్నా. నేను ఈ పురస్కారానికి అర్హుడినేనని భావించిన వారికి కృతజ్ఞతలు’ అని శశిథరూర్ ట్వీట్ చేశారు. 2010లో థరూర్‌కు స్పెయిన్ ప్రభుత్వం సైతం ఇదే విధమైన గౌరవం అందజేసింది.మరోవైపు ఈ పురస్కారం దక్కడంపై శశిథరూర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. శశిథరూర్ తిరువనంతపురం నియోజకవర్గానికి వరుసగా మూడో సారి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితిలో వివిధ హోదాల్లో 23 ఏళ్లపాటు సుదీర్ఘంగా విధులు నిర్వర్తించారు. అనేక పుస్తకాలు రాశారు. అప్పుడప్పుడు తన ట్విటర్ పోస్టుల్లో అరుదైన ఆంగ్ల పదాలను వాడుతూ.. నెటిజన్లకు సవాల్ విసురుతుంటారు!
13.స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా వజ్రోత్సవ వేడుకలు
` రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఫ్రీడమ్ రన్
` పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజలు
హైదరాబాద్(జనంసాక్షి):స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఫ్రీడం రన్‌ను నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బానిస సంకెళ్లు తెంచుకొని యావత్ భారతావని స్వేచ్ఛా వాయువులు పిలుస్తూ 75 వసంతాలు పూర్తిచేసుకున్న శుభ సమయంలో.. రాష్ట్రంలో 15 రోజులపాటు సంబురాలు, దేశ భక్తి పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు వారీగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయని వెల్లడిరచారు. వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్‌లో నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌ను మంత్రి సబితా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు పేదల చెంతకు చేరినప్పుడే స్వాతంత్య ఫలాలు అందినట్లు సీఎం కేసీఆర్ భావిస్తారని వెల్లడిరచారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్ర ప్రజల చిరునవ్వుకు కారణమవుతున్నారన్నారు. పల్లెలు,పట్టణాల్లో ఫ్రీడమ్ రన్ విజవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్య స్ఫూర్తి చాటేలా, జాతీయ దృక్పథంతో ఎందరో అమరులు చేసిన త్యాగాలు స్మరిస్తూ వజ్రోత్సవాల వేళ పరుగు పెడుతున్నట్లు తెలిపారు. ª`వాతంత్య పోరాటంలో మహాత్మ గాంధీజీ చేసిన పోరును రానున్న తరాలు గుర్తుపెట్టుకునేలా గాంధీజీ చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా చూపిస్తున్నామన్నారు. ప్రజలందరికి ముందస్తుగా స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సరూర్ నగర్ స్టేడియం నుంచి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వరకు నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లో పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. భారీ జాతీయ పతాకంతో రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు దయానంద్, ఎª`గగె మల్లేశం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ పాల్గొన్నారు.భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తి తోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మంత్రి ఫ్రీడం రన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ నెª`లకెస్ రోడ్డు లో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకం తరహాలో తొర్రూరు జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న భారీ జాతీయ పతాక కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడూతూ..పోరాడి సాధించిన తెలంగాణ తెర్లు కాకుండా అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలబడడానికి సీఎం కేసీఆర్ గాంధీజీ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేశంలో 20 అత్యున్నత ఆదర్శ గ్రామాలను లెక్క తీస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణవే రావడమే ఇందుకు నిదర్శనమని మంత్రి అన్నారు.