| జస్టిస్ బద్రుద్దీన్ తయజ్ [1844-1906)


 


 


 


జాతీయోద్యమంలో మూడుతరాల వ్యక్తులు ప్రధాన పాత్ర వహించిన ఘన చరిత్ర కలిగిన తయబ్ జీ కుటుంబానికి చెందిన జస్టిస్ బద్రుద్దీన్ తయబ్జీ. మహారాష్ట్రలోని కాంబేలో 1844 అక్టోబర్ 8న జన్మించారు. ఆయన తండ్రి తయ్యబ్ ఆలీ, తల్లి అమినా తయబ్జీ. స్వదేశీ విదేశీ వ్యాపారాలలో తనదైన సామ్రాజ్యాన్ని సృష్టించుకు ప్రముఖ వ్యాపారవేత్త తయబ్ ఆలీ. ఆధునిక సత్సాంప్రదాయలను ఆయన గౌరవించారు. ఆచరించారు. సమకాలీన పరిస్థితులకు భిన్నంగా తయబ్ ఆలీ తన బిడ్డలకు ఆధునిక, ఆంగ్ల భాషల్లో చదువులు చెప్పించారు. ఆ వాతావం ణంలో పెరిగిన బద్రుద్దీన్ తయబ్ జీ చిన్న వయస్సులో ఉర్దూ, పర్షియన్, అరబిక్, గుజరాతి, మరాఠి భాషలను, కొద్దిగా ఆంగ్ల భాషను నేర్చుకున్నారు. 1865లో మోతి బేగంను బద్రుద్దీన్ వివాహమాడారు. 1867లో లండన్ వెళ్ళి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకుని బొంబాయి వచ్చి అత్యధిక సంపాదన గల బారిస్టర్ గా బద్రుద్దీన్ తయబ్జీ పేరు గాంచారు. బొంబాయిలో 'త్రీస్టార్స్'గా ఖ్యాతి గాంచిన ఫెరోజ్ షాహ్ మెహతా, కాశీనాధ్ తెలండ్లతో తాను ఒకరిగాప్రజల పక్షాన 1871లో ప్రారంభించిన ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రజా సేవారంగంలో ఆయన అడుగుపెట్టారు. ఆ క్రమంలో 1873లో బద్రుద్దీన్ తయబ్ జీ బొంబాయి కార్పోరేటర్‌గా, 1882లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎంపికయ్యారు. ఆంగ్ల ప్రభుత్వం భారతీయుల పట్ల అనుసరిస్తున్న విచక్షణా పూరిత విధానాలను ఆయన వ్యతిరేకించారు. 1885 డిసెంబర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తరువాత బద్రుద్దీన్ తయబ్ జీ ఆ సంస్థతో పూర్తిగా మమేకమ య్యారు. భారత జాతీయ కాంగ్రెస్ విధివిధాన నిర్ణయాలలో, రూపకల్పనలో బద్రుద్దీన్ తయబ్జీ ప్రధాన పాత్ర నిర్వహించారు. ముస్లింలను భారత జాతీయ కాంగ్రెస్ కు దూరంగా ఉంచాలని ప్రయత్నించిన సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్, సయ్యద్ అమీర్ ఆలీ, నవాబు అబ్దుల్ లతీఫే లాంటి ప్రముఖుల వాదనలను ఆయన సమర్థవంతంగా తిప్పికొట్టారు. 1887లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ సమావేశాలకు బద్రుద్దీన్ తయబ్ జీ అధ్యక్షత వహించారు. 1895లో బొంబాయి ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే వరకు భారత జాతీయ కాంగ్రెస్ పెరుగుదల, పటిష్టతకు ఆయన ఎంతగానో శ్రమించారు. సాంఘిక, విద్యా, ఆర్థిక రంగాలలో ముస్లింల పురోభివృద్ధిని, ముస్లిం సమాజంలో సంస్కరణలను కోరిన ఆయన ఆడపిల్లలకు ఆధునిక విద్య అవసరమన్నారు. ఈ మేరకు పలు సేవా-విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన ఆయన పలు కార్యక్ర మాలను చేపట్టారు. 1902లో బొంబాయి హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు చేపట్టిన తయబ్జీ 1906లో పూర్తి స్థాయి న్యాయ మూర్తిగా నియమితులయ్యారు. అటు జాతీయవాదిగా, ఇటు ప్రధాన న్యాయ మూర్తిగా, మరోవైపు ప్రజాసేవకుడిగా అపూర్వ సేవలందించారు. 'మొదట భారతీయు డుగా, ఆ తరువాత ముస్లింగా, తుదకు విశ్వమానవుడు'గా ఖ్యాతి గడించిన జస్టిస్ బద్రుద్దీన్ తయబ్జీ 1906 ఆగస్టు 19న ఇంగ్లాండులో కన్నుమూశారు. సయ్యద్ నశీర్ అహమ్మద్ (9440241727)