నేటినుంచి 3రోజుల పాటు విూసేవ బంద్‌

నిజామాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఈ నెల13 శుక్రవరాం నుంచి మరో మూడు రోజుల వరకు విూ సేవా కేంద్రాలు పనిచేయవని నిజామాబాద్‌ జిల్లా ఈడీఎం కార్తీక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విూ-సేవా డేటా బేస్‌


కార్యకలాపాలను మెరుగుపర్చనున్న కారణంగా ఈ విరామం ఉంటుందని ఆయన ప్రజలకు తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 13 డిసెంబర్‌ రాత్రి 7 గంటల నుంచి 16 డిసెంబర్‌ ఉదయం వరకు విూ సేవా కేంద్రాలు బందుంటాయని సమాచారం. తిరిగి డిసెంబర్‌ 16 ఉదయం 8 గంటల నుంచి విూ సేవా కేంద్రాల సేవలు అందుబాటులోకి వస్తాయనీ, అందుకు గాను ప్రజలందరూ సహకరించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.