ఐటి కారిడార్‌ కోసం భూముల పరిశీలన

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): శావిూర్‌పేట మండలానికి మహర్ధశ పట్టనుంది. ఐటీ కారిడార్‌లో భాగంగా శావిూర్‌పేట మండలం, తూంకుంట మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల పరిశీలనలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమయ్యారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ, వైస్‌ చైర్మన్‌ ఈవీ. నర్సింహ్మరెడ్డిలు శావిూర్‌పేట, తూంకుంట మున్సిపాలిటీ దేవరయాజాంల్‌, మేడ్చల్‌, కుత్భుల్లాపూర్‌ మండలాల్లో ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఐటీ లాజిస్టిక్‌ హబ్‌ ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఎండీ, వైస్‌ చైర్మన్‌ ఈవీ.నర్సింహ్మరెడ్డి, అధికారులు, ఆర్డీవో మధుసూదన్‌, తహసీల్దార్‌ గోవర్ధన్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.