చీలీ విమానం అదృశ్యం


న్యూఢిల్లీ,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): చిలీ దేశ వైమానిక దళానికి చెందిన విమానం అదృశ్యమైంది. 38 మందితో వెళ్తున కార్గో సైనిక విమానం ఆచూకీ లేకుండ ఆపోయింది. అంటార్కిటికా వెళ్తున్నరూట్లో ఆ విమానం కనిపించకుండాపోయిందని ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నది. సీ-130 హెర్క్యూల్స్‌ ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాప్ట్‌ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు విమానం మిస్సైంది. పుంటా ఏరినాస్‌ నగరం నుంచి టేకాఫ్‌ తీసుకున్న తర్వాత అది ఆచూకీలేదు. విమానంలో 17 మంది సిబ్బంది, 21 మంది ప్రయాణికులు ఉన్నారు. మిస్సైన విమానం గురించి రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.