జిల్లాస్థాయిలో పోటీ పరీక్షలు

కామారెడ్డి,డిసెంబర్‌14(జనం సాక్షి ): జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్షల పోస్టర్లను జేసీ యాదిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు, గణితంలో మంచి మార్కులు సాధించేందుకు ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రామానుజన్‌ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఈ నెల 22న కరీంనగర్‌లో పరీక్షను నిర్వహించనున్నట్లు చెప్పారు.