'క్యాబ్‌'ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలు

- బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు


- ఈశాన్యంలో ఆగని అల్లర్లు


- అరుణాచల్‌లో పరీక్షల బహిష్కరణ


- బెంగాల్‌లో రైల్వే స్టేషన్‌కు నిప్పు


- అమిత్‌ షా మేఘాలయ పర్యటన రద్దు


- నిరసనకారులతో చర్చలకు సిద్దమన్న అసోం సిఎం సర్బానంద్‌ సోనోవాల్‌


- ఆందోళనలు విరమించి శాంతికి సహకరించాలని విజ్ఞప్తి


న్యూఢిల్లీ,డిసెంబర్‌ 13(జనంసాక్షి):పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్టాల్రు అట్టుడుకి పోతున్నాయి. అసోం సహా త్రిపుర, మేఘాలయ రాష్టాల్ల్రో ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు, కాల్పులతో ఈ ప్రాంతాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కాగా.. ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా షిల్లాంగ్‌ పర్యటన రద్దయింది. షెడ్యూల్‌ ప్రకారం.. ఆదివారం షిల్లాంగ్‌లోని ఈశాన్య పోలీస్‌ అకాడవిూని అమిత్‌ షా సందర్శించాల్సి ఉంది. కాగా.. ఈ పర్యటనను షా రద్దు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే శనివారం, సోమవారం ఆయన ఝార్ఖండ్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గత మూడు రోజులుగా అసోంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి మరీ ఆందోళన కారులు రో/-డడెక్కి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరపగా.. ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరోవైపు ఆందోళనలు విదేశీ మంత్రులు, ప్రతినిధుల పర్యటనపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నిరసనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ మంత్రులు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన కూడా వాయిదా పడింది.


నిరసనకారులతో చర్చలకు సిద్దం


ఆందోళనలు విరమించి శాంతికి సహకరించాలి


పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులతో చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అస్సాం సీఎం సర్బానంద్‌ సోనోవాల్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు, సమస్యకు రాజ్యాంగపరమైన పరిష్కారం చూపేందుకు గువహాటి హైకోర్టు విశ్రాంత చీఫ్‌ జస్టిస్‌ బిప్లబ్‌ శర్మ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని వేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక ఆందోళనల వల్ల దుష్పభ్రావం ఉంటుంది. శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి ఆందోళనలకు ప్రజాస్వామ్య సమాజం వ్యతిరేకం. శాంతిని పునఃస్థాపించడం అస్సాంకు, ఇక్కడి ప్రజలకు చాలా ముఖ్యం. ఆందోళనకారులతో చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. అస్సాం అస్తిత్వ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని, కేంద్ర ¬ం మంత్రి ప్రకటించారు. మనకెలాంటి భ్రమలూ అక్కర్లేదు. శాంతిపూర్వకంగా ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకు కొంత సమయం ఇవ్వాలి ప్రధాని కూడా ఇదే విషయం చెబుతూ ట్వీట్‌ చేశారు. విూరు దీన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకువెళ్లలేక పోతున్నారని అన్నారు. కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నిజాలు బయటకు రావడం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాల వల్లే ఈ ఆందోళనలన్నీ జరుగుతున్నాయి. వాస్తవం ఏంటన్నది వారు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంత మందికి పౌరసత్వం వస్తుందంటూ ఒక్కొక్కరూ ఒక్కో సంఖ్య చెబుతున్నారు. వీటన్నింటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. పౌరసత్వ చట్టానికి సవరణ చేయడం ఇదేవిూ మొదటిసారి కాదు. అంతకుముందు ప్రభుత్వాలు కూడా తొమ్మిది సార్లు సవరణలు చేశాయి. ఇంటర్నెట్‌ ఆపేసి, కర్ఫ్యూ విధించి ఎంత కాలం ప్రభుత్వం నడపగలుగుతారు? పోలీస్‌, సాయుధ బలగాలు, ఇంటెలిజెన్స్‌ ఉన్నా, సైన్యం అవసరం ఎందుకు ఏర్పడింది? ఈ ఆందోళనల్లో అందరూ భాగం కావట్లేదు. చట్ట వ్యవస్థ కొన్ని పక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలా వెళ్లగలదు? ఇదంతా వ్యవస్థ శాంతియుతంగా నడిచేందుకే. జనాలను గందరగోళానికి గురిచేసేందుకు కాదు. ప్రజలు మాకు సహకరించాలన్నారు.


16న భారీ ర్యాలీతో నిరసన చేపడతాం: మమతా


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ నమోదు(ఎన్‌ఆర్‌సీ) చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయమని సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.రాష్ట్రం నుంచి ఏ ఒక్కరిని శరణార్థిగా బయటకు పంపించే ప్రసక్తే లేదన్నారు.కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా డిసెంబర్‌ 16న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ వర్దంతిని పురస్కరించుకుని కోల్‌కతాలో మెగా ర్యాలీ చేపట్టనున్నట్టు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అంబేడ్కర్‌ విగ్రహం నుండి జొరసాంకో వరకు నిరసన ర్యాలీ జరుపుతామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం దేశాన్ని విభజించేలా ఉందని.. బెంగాల్‌లో తాము అధికారంలో ఉన్నంతవరకు ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌,పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ కూడా పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించారు. తమ రాష్టాల్ల్రో ఎన్‌ఆర్‌సీని అమలుచేసేది లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే తృణమూల్‌ కాంగ్రెస్‌,కాంగ్రెస్‌ పార్టీలు కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుప్రీం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


బెంగాల్‌లో రైల్వే స్టేషన్‌కు నిప్పు


పౌరసత్వ సవరణ చట్టంపై విద్యార్థిలోకం భగ్గుమంది. శుక్రవారం దిల్లీతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. దిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ వివాదాస్పద చట్టంపై చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్‌ భవనం వద్దకు దాదాపు 2వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వర్సిటీ వద్ద విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా.. వాటిని విరగ్గొట్టుకుంటూ విద్యార్థులు ముందుకు సాగారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న తమను అడ్డుకోవడం భావ్యంకాదంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా విద్యార్థులు వినకపోడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో విద్యార్థులు రాళ్లు రువ్వడంతో వర్సిటీ వద్ద పరిస్థితి రణరంగంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు 50 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సూచన మేరకు దిల్లీ మెట్రో అధికారులు పటేల్‌ చౌక్‌, జన్‌పథ్‌ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.


అరుణాచల్‌లో పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు


మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు విద్యార్థి సంఘాల నేతృత్వంలో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. తక్షణమే పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేస్తూ వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతృత్వంలో విద్యార్థులు రాజ్‌భవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి పలువురు అస్సావిూయులు కూడా మద్దతు తెలిపారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రాజ్‌భవన్‌కు చేరారు. అనంతరం గవర్నర్‌ బీడీ మిశ్రాకు వినతిపత్రం సమర్పించారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేయవద్దని విద్యార్థులు కోరారు. అనంతరం ఆందోళనకారులు మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దాన్ని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ చట్టం తమ ప్రాంతాన్ని మతపరంగా విభజన తీసుకొస్తుందని.. స్థానిక ప్రజల ఉనికిని దెబ్బతీసేలా ఉందని విమర్శించారు.


బెంగాల్‌లో చెలరేగిన హింస


మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టంపై బెంగాల్‌లోనూ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. వేలాది మంది ఆందోళనకారులు బంగ్లాదేశ్‌ సరిహద్దులోని ముర్షిదాబాద్‌ జిల్లాలోని బెల్దంగా రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి నిప్పు పెట్టారు. అక్కడి సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపైనా దాడి చేశారు