పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క
తక్షణం రైతులను ఆదుకోవాలని వినతి
ములుగు,డిసెంబర్19 (జనంసాక్షి): ములుగు మండలంలోని కాశీందేవిపేట గ్రామా శివారులో గల మిర్చి తోటలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ కాశీందేవిపేట గ్రామంలో సుమారుగా 500 ఎకరాలలో మిర్చి పంటను సాగు చేస్తే కల్తీ విత్తనాల వలన వైరస్ సోకి 300 ఎకరాలలో పంట పూర్తి స్థాయిలో దెబ్బతిందని అన్నారు. విత్తన బాండాగారంగా తెలంగాణ రాష్ట్రంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కల్తీ విత్తనాల వలన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందని అన్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విదంగా రైతుల క్రాఫ్ లొనులలో బ్యాంక్ అధికారులు క్రాఫ్ ఇన్స్యూరెన్స్ కట్ చెస్తున్నప్పటికీ రైతుల పంటలు నష్ట పోతే మాత్రం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించక పోతున్నారని అన్నారు. వెంటనే కలెక్టర్ బ్యాంకర్ల తో సమావేశం ఏర్పాటు చేసి పంట భీమా రైతుకు అందేలా చూడాలని సీతక్క అన్నారు. వెంటనే వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని లేని యెడల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,స్థానిక సర్పంచ్ ఎండీ అహ్మద్ పాషా.గ్రామా కమిటీ అధ్యక్షులు మర్రి రాజు,.ఉప సర్పంచ్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.