పౌరచట్టపై సంయమనం అవసరం: యెడ్యూరప్ప

బెంగళూరు,డిసెంబర్‌19 (జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)దేశరాజధాని నగరం ఢిల్లీతోపాటు వివిధ రాష్టాల్ల్రో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం యడియూరప్ప మాట్లాడుతూ..సీఏఏ అంశంపై రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. సీఏఏతో దేశప్రజలకు ఎలాంటి నష్టంకానీ, ముప్పుకానీ ఉండబోదన్నారు. ఈ చట్టం కేవలం ఇతర దేశాల నుంచి ఇక్కడికొచ్చి..భారత పౌరసత్వం కోరుకునే వారి కోసం మాత్రమేనని యడియూరప్ప అన్నారు. సీఏఏపై బెంగళూరులో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు సంయమనంతో వ్యవహరించి లాఠీఛార్జీ ఏం చేయకూడదని సీఎం యడియూరప్ప ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.