ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్యం సాధ్యం


సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇదే మార్గం


మంత్రి కెటిఆర్‌ తరచూ చేస్తున్న సూచనలు ఇవే


హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రజలు డెంగీ, తదితర వైరల్‌ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా వానాకాలంలో ఇటువంటి వ్యాధులు ప్రబలడం సర్వసాధారణంగా మారింది. చలికాంల వచ్చే సరికి స్వైన్‌ ఫ్లూ లాంటి వ్యాధులు విజృంభిస్తున్నారు. పట్టణాలఉ,పల్లెలు అనే తేడా లుకుండా స్వచ్ఛంగా ఉంచాలని పదేపదే ప్రచారం చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు తమకేంటన్న భావనతో అపరిశుభ్రతకు కారణమవుతున్నారు. ఇకపోతే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతు న్నామని నాయకులు చెపుతున్నా వాస్తవం వేరే రకంగా కనిపిస్తోంది. పారిశుద్ధ్యలేమి కారణంగానే ఇటువంటి వ్యాధులు ప్రబలుతున్న విషయం సుస్పష్టం. ఈ క్రమంలో ప్రజలు పురపాలకసంస్థపై ధ్వజమెత్తుతున్నారు. అపరిశుభ్రత కారణంగా దోమలు విజృంబించడంతో డెంగీ వ్యాధికి చికిత్స పొందుతూ మరణించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. సీజనల్‌ వ్యాధుల నివారణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవు తుందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అభిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ తరుపున దోమల నివారణతో పాటుగా పారిశుద్ధ్య నిర్వహణ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ పైన దృష్టి సారించి, ప్రభుత్వ ప్రయత్నాలతో కలిసి రావాలని పిలుపిచ్చారు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు సొంత ఇళ్లలోని పారిశుద్యం అత్యంత కీలకమైన అంశం అన్నారు. ఇళ్ళలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేసి, పారిశుద్ద్య నిర్వహణలో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వ అధికారులు, పురపాలక ప్రతినిధులు కృషి చేస్తూనే ఉన్నారు. ఇళ్ళలో పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పదేపదే కోరుతున్నారు. ముఖ్యంగా దోమల వృద్ధికి అవకాశం ఉన్న ఉన్న నీటి తొట్లు, నీటి నిలువ ప్రదేశాల్లో నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు. దీంతోపాటు ఇంటి మూలల్లో ఉన్న ఉపయోగంలో లేని వస్తువులను తీసివేసి, దోమల లార్వా వృద్ధికి అవకాశం లేకుండా చేసే చర్యలను చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన పైన దృష్టి సారించి సీజనల్‌ వ్యాధుల బారి నుంచి కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇళ్ళ ముందు కానీ లేదా ఇంటి లోపల నీటి నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదా వాటిపైన నూనెను చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దీంతోపాటు ఇళ్లలో ఉన్న పనికిరాని లేదా ఉపయోగం లేని లేని వస్తువులను తొలగించుకోవాలని కోరారు. అప్పుడేసీజనల్‌ వ్యాధులను రాకుండా నిరోధించగలమని అన్నారు.