కలెక్టర్ను కలిసిన మిషన్ అంత్యోదయ సభ్యులు
నిజామాబాద్ బ్యూరో,డిసెంబర్19(జనంసాక్షి):

మిషన్ అంత్యోదయ జాతీయ స్థాయి మానిటరింగ్ కమిటీ టీం సభ్యులు డాక్టర్ టి. విశ్వనాథ్ జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు ను ఆయన ఛాంబర్లో కలిశారు.జిల్లాలో  కొనసాగుతున్న మిషన్ అంత్యోదయ సర్వే పనులను ఆయన పరిశీలించడానికి జిల్లాకు వచ్చారు. గురువారం నాడు ఆయన కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసి సర్వే తీరును కలెక్టర్కు వివరించారు. ఆయన శుక్రవారం నుండి 10 గ్రామ పంచాయతీలలో పర్యటించి ఈ సర్వేను పర్యవేక్షిస్తారు. వారితో పాటు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ పాల్గొన్నారు.