తెలంగాణ సర్కార్‌ ఆర్థిక క్రమశిక్షణ


కేబినేట్‌ నిర్ణయంతో ఇక ఖర్చులపై ఆంక్షలు


హైదరాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): బుధవారం రాత్రి జరిగిని కేబినేట్‌లో పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మాద్యం ప్రభావాన్ని గ్రహించి అన్ని శాఖల్లో నిధుల ఖర్చుపై నియంత్రణ పాటించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అన్ని శాఖలు విధిగా నియంత్రణ పాటించాల్సిందేనని, కేటాయింపులకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా ఏ శాఖ ఖర్చు చేయడానికి వీల్లేదని ఆయన చెప్పారు. సరైన ఆర్థిక క్రమశిక్షణ తోనే పరిస్థితిని ఎదుర్కోగలమని కెసిఆర్‌ సూచించారు.అంతేకాకుండా దుమ్ముగూడెంలో గోదావరిపై 320 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే విధంగా బ్యారేజి నిర్మించాలని, రూ. 3,482 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజికి అయ్యే ఖర్చును రెండు సంవత్సరాల బ్జడెట్లలో కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 37 టిఎంసిల నిల్వ సామర్థ్యం, 63 విూటర్ల ఎత్తు, భూసేకరణ అవసరం లేకుండా బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదనను ఆమోదించింది. అంతేకాకుండా మధ్యమానేరు వరకు 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసే పనులను కూడా చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత ప్లలెప్రగతి పురోగతిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రజల నుంచి విశేష ఆదరణ లభించినా అధికారులు ఎందుకు విఫలమయ్యారని సిఎం కెసిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.