మున్సిపల్‌ ఎన్నికలతో రాజకీయ వేడి


రిజర్వేషన్ల కోసం నేతల ఎదురుచూపు
హైదరాబాద్‌,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం స్తబ్ధుగా ఉన్న రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలతో రాజకీయపార్టీల్లో కదలిక కనిపిస్తోంది.  రాజకీయపక్షాలు పురపాలికల్లో  పట్టు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. మరోమారు  తమ సత్తాచాటుకనేందుకు తెరాస సిద్ధమవుతోంది. రానున్న స్థానిక,  ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని తమ వ్యూహానికి పదును పెడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తోంది. తెరాస సమరోత్సాహంతో  సత్తాచాటుకునేందుకు సమాయత్తమవుతోంది. పంచాయతీల్లో సాధించిన ఫలితాలే రిపీట్‌ చేసేలా  కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తోంది.  బాధ్యతలను నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యులకు పార్టీ అధిష్ఠానం కట్టబెట్టడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రిజర్వేషన్ల ఖరారు కొలిక్కి రాకవడంతో కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంది. అలాగే ససమర్దులైన అభ్యర్థులను తమ మద్దతుదార్లుగా రంగంలోకి దించేలా కసరత్తు సాగిస్తోంది. ఎన్నికల్లో ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థుల జాబితాను రిజర్వేషన్లకు అనుగుణంగా వడపోస్తూ.. ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.  ఓటమికి భయపడకుండా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బలం పెంచుకుంటామని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల ఆధిక్యం కనబరచిన చోట దీటైన అభ్యర్థులను రంగంలో దించేలా వ్యూహం పన్నుతున్నారు.