మురికి చేతుల్లో దుమ్ము _ శుభ్రమైన చేతుల్లో దమ్ము.......





వలిగొండ జనం సాక్షి న్యూస్19:అపరిశుభ్రమైన చేతులతో షేక్ హ్యాండ్(కరచాలనం)చేయడం ద్వారా స్వైన్ ఫ్లూ, టైఫాయిడ్, కలరా,న్యుమోనియా,డయేరియా,కంటిజబ్బులు,చర్మవ్యాధులు వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయని  ప్రతి ఒక్కరూ తరచుగా సబ్బు నీటితో చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం.సుమన్ కళ్యాణ్ మరియు ఆరోగ్య పర్యవేక్షకుడు నాశబోయిన నరసింహ అన్నారు.గురువారం మండల పరిధిలోని ఆర్రూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వైన్ ఫ్లూ వ్యాధిపైఅవగాహనా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మురికి చేతుల్లో దుమ్ము ఉంటుందని, శుభ్రమైన చేతుల్లో దమ్ము ఉంటుందని ప్రతిసారిచేతులను సబ్బునీటితో 7 పద్ధతుల (టెక్నిక్)ద్వారా ఎలా శుభ్రం చేసుకోవాలోచేసిచూపించారు.పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనవెన్నంటే ఉండేది మనదేహం మాత్రమే అటువంటి దేహంపట్ల భాధ్యత గా ఉంటూ,వ్యక్తిగత,పరిసరాల పరిశుభ్రతపాటిస్తూ,ముందస్తుజాగ్రత్తలతో స్వైన్ ఫ్లూని నివారించవచ్చని అన్నారు. జ్వరం,దగ్గు,జలుబు, ఒంటినొప్పులు, ఆయాసంతో ఊపిరి తీసుకోలేక పోవటం వంటి లక్షణాలు ఉన్నట్లయితే స్వైన్ ప్లూ గా అనుమానిం చాలన్నారు.తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరుమాలు   అడ్డం పెట్టుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదన్నారు. ఎక్కువగా ద్రవ పదార్థాలు తాగుతూ పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ లు కే.శోభారాణి, ఆర్.సంధ్యా రాణి, ఆశాకార్యకర్తలు సంతోష,అలివేలు,రాణి,ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.