రియల్టర్‌ ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి) :  జవహర్‌ నగర్‌ మైత్రీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న స్థిరాస్తి వ్యాపారి నర్సింగ్‌రావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. 50 తులాల బంగారు నగలు, 5 కిలోల వెండితో పాటు నగదును దుండగులు అపహరించారు. బాధిత కుటుంబం నిన్న రాత్రి యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దర్శనానికి వెళ్లింది. ఈ సమయంలోనే దొంగలు చోరీ చేశారు. నర్సింగరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చోరీ జరిగిన నివాసాన్ని పోలీసులు పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.