టిఆర్‌ఎస్‌కు షాక్‌

బిజెపిలో చేరిన కార్పోరేటర్‌ జయశ్రీ
కరీంనగర్‌,జనవరి7(జనంసాక్షి): కరీంనగర్‌లో అధికార పార్టీకి షాక్‌ తగిలింది. అధికార పార్టీకి చెందిన టీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్‌ చొప్పరి జయశ్రీ బిజెపిలో చేరారు. మంత్రి గంగుల కమాలకర్‌తో విబేధాల కారణంగా  మాజీ కార్పొరేటర్‌ చొప్పరి జయశ్రీ వేణు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు.  బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సమక్షంలో జయశ్రీ కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా కప్పిన బండి.. సాదరంగా ఆహ్వానించారు. గత ఎన్నికల్లో కరీంనగర్‌ 30వ డివిజన్‌ నుంచి టీఆరెస్‌ తరపున వేణు జయశ్రీ గెలిచారు. కాగా.. మునిసిపల్‌ ఎన్నికలకు ముందు జయశ్రీ టీఆర్‌ఎస్‌కు టాటా చెప్పేయడం పార్టీకి షాక్‌ తగిలినట్లేనని స్థానిక నేతలు చెబుతున్నారు.  బీజేపీ తరఫున ఈ ఎన్నికల్లో జయ శ్రీ పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది.