లోగో, వెబ్‌సైట్ ప్రారంభించిన ఐటి మంత్రి కేటీఆర్
హైదరాబాద్,డిసెంబర్ 2 జనం సాక్షి : నూతన సంవత్సరం 2020ని తెలంగాణ రాష్ట్రం కృత్రిమ మేధా సంవత్సరంగా జరుపుకోనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను మంత్రి గురువారం హైదరాబాద్,గ్రీన్‌పార్క్ ¬టల్‌లో కేటీఆర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టెక్నాలజీ ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతిక ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇంటెల్, పీహెచ్‌ఎఫ్‌ఐ, అడోబ్, నివిడ. హెక్సాగన్ సంస్థలతో ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 'సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఏఐ' ఏర్పాటు కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ హైదరాబాద్ ..మౌలిక సదుపాయాలు, స్టాటజీ భాగస్వామిగా వ్యవహరించనుంది. /ుజిస్టేష్రన్ శాఖతో పాటు పోలీస్ శాఖలో పైలట్ ప్రాజెక్టులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ఏఐ బేస్డ్ ఎస్టిమేషన్ మేనేజ్‌మెంట్ అప్లికేషన్ ప్రారంభంతో పాటు 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాలెండర్‌ను మంత్రి విడుదల చేశారు. నివిదతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు, ఆడోబ్, కెపాసిటీ బిల్డింగ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు,. ఐఐఐటీహెచ్‌తో ఎడ్యూకేషన్, ట్రైనింగ్, వాద్వాని ఆర్టిఫిషియల్, హెక్సగాన్ వ్యాపబుల్ సెంటర్ ఏర్పాటుకు, నార్వే క్లస్టర్ ఆఫ్ ఐప్లెడ్ ఏఐతో, మహింద్రా కాలేజీతో, నాస్కామ్‌తో ఒప్పందాలు కుదిరాయి. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.