అత్యాచార హత్యగా భావిస్తున్న పోలీసులు
జగిత్యాల,జనవరి2 (జనం సాక్షి) : జిల్లాలోని వెల్గటూరు మండలం కొండాపూర్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హతమార్చారు. మహిళ బుధవారం కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో మహిళ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా గ్రామశివారులోని పంటపొలం సవిూపంలో వివస్త్రగా మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.