ప్రజల భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి విజయవంతం


అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి


నిర్మల్‌,డిసెంబర్‌ 2 జనం సాక్షి   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్లలె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత విజయవంతమవుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.  గ్రామాలను ప్రగతి బాట పట్టించే బృహత్తర ప్లలె ప్రగతి రెండో విడత కార్యక్రమాన్ని దిలావర్‌ పూర్‌ మండలం సిర్గాపూర్‌ గ్రామంలో మంత్రి అల్లోల గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్లలెల్లో పచ్చదనం, పారిశుద్ద్యాన్ని మెరుగుపరుస్తూ ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు ప్లలె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు నిబద్ధతతో, కార్యదీక్షతో పనిచేయాలని సూచించారు. ప్లలె ప్రగతిని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలోనాటిన మొక్కలను సంరక్షించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొన్ని చోట్ల నాటిన మొక్కలు ఎండిపోవడాన్ని చూసిన మంత్రి స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నాటిన మొక్కలకు నీటి వసతి, రక్షణ వలయాలు, నర్సరీలను తెలిపే బోర్డులు, నర్సరీల నిర్వాహణ రిజిస్టర్లు సక్రమంగా ఉండాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై తగు చర్యలు తప్పవన్నారు. ఇళ్లతో పాటు గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. గ్రామానికి ప్రతి ఒక్కరూ సేవ చేయాలని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశ్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధుల పనితీరును కూడా బేరీజు వేస్తున్నామని, సర్పంచ్‌లు,ఎంపిటిసి,జెడ్పిటిసిలు భాగస్వాములు కావాలని కోరారు. రెండో విడత పల్లె ప్రగతి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోందని, దీంతో పల్లెలు వికసిస్తాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ భాస్కరరావు, ఎంపిపి అమృత చిన్నారెడ్డి, సర్పంచ్‌ ఈ గంగారెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు సుభాష్‌ రావు, మండల్‌ కన్వీనర్‌ దేవేందర్‌ రెడ్డి, నాయకులు మురళీధర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.