నాసిక్‌లోనూ చిరుత క‌ల‌క‌లం

ముంబై,మే30(జ‌నంసాక్షి): మహారాష్ట్ర నాసిక్‌లోని ఇందిరా నగర్‌లో ఓ చిరుత పులి స్థానికును తీవ్ర భయభ్రాంతుకు గురి చేసింది. శుక్రవారం సాయంత్రం 5:23 గంట సమయంలో చిరుత జనవాసాల్లోకి వచ్చింది. రోడ్డుపై ఉన్న ఇద్దరు వ్యక్తుపై చిరుత దాడి చేసి గాయపరిచింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని చికిత్స నిమిత్తం సవిూప ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికాయి, పోలీసు కలిసి పులి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వ్యక్తును గాయపరిచిన అనంతరం అది అడవిలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికాయి నిర్దారించారు. పులిని నిర్బంధించేందుకు అధికాయి యత్నిస్తున్నారు.