ఆగని పెట్రోల్‌ మంటలు


12వ రోజూ పెరిగిన ధరు
న్యూఢల్లీి,జూన్‌18(జ‌నంసాక్షి): కరోనావైరస్‌తో అంతర్జాతీయంగా ముడిచమురు ధరు పడిపోయినా భారత్‌లో మాత్రం పెట్రో ధరు భగ్గుమంటున్నాయి వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరను పెంచేశాయి చమురు సంస్థు. ఇవాళ లీటర్‌ పెట్రోల్‌పై 53 పైసు వడ్డించగా... లీటర్‌ డీజిల్‌పై 64 పైసు పెంచేశాయి.. దీంతో.. 12 రోజుల్లో ఏకంగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ ..6.55 పెరగగా.. లీటర్‌ డీజిల్‌ రూ .7.04 పెరిగింది.. ఇక తాజా ధరను పరిశీలిస్తే.. ఢల్లీిలో పెట్రోల్‌ ధర రూ.77.81, డీజిల్‌ రూ.76.43గా.. ముంబైలో పెట్రోు ధర రూ. 84.66, డీజిల్‌ రూ.74.93గా.. చెన్నైలో పెట్రోు ధర రూ.81.32, డీజిల్‌ ధర రూ.74.23గా.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోు ధర రూ.80.77, డీజిల్‌ ధర రూ.74.70గా ఉండగా.. అమరావతిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 81.19?, డీజిల్‌ ధర రూ.75.18 కి చేరుకుంది.