భారత్‌లో పైపైకి పెట్రో ధరలు


న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నా.. భారత్‌లో మాత్రం అ వి నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. కరోనాను అరి కట్టే పేరుతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలు మినహా రవాణా పూర్తిగా బంద్‌ అయినప్పటికీ.. పన్నుల పేరిట కేంద్ర ప్రభుత్వ దోపి డీకి అడ్డుకట్ట పడలేదు. దీంతో రెండు నెలల కాలం లోనే దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ. 5 వరకు ధరలు పెరిగాయి. ఢిల్లీలో అయితే లీటర్‌ డీజిల్‌ ధర ఏకంగా పది రూపాయలు పెరిగిం ది. 82 రోజులుగా ఇంధన ధరల్లో మార్పులు లేక పోయినా.. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతున్నా.. భారత్‌లో మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి.