నిండకుండలా నాగార్జున సాగర్.. 18 గేట్ల ఎత్తివేత

హైదరాబాద్‌ : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు 18 గేట్లు పది మేర అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.42లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టుకు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో వచ్చిన వరదను వచ్చినట్లే కిందకు వదులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 310.55 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులో నీటిమట్టం 590 అడుగుల మేర నీరుంది. మరో మూడు నాలుగు రోజులు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు కొనసాగితే జలాశయానికి మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.