సింగూర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం


సంగారెడ్డి: జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి మట్టం 29.589 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రాజెక్టు లోకి వరద నీటి ఇన్ ఫ్లో 8675 క్యూసెక్కులు చేరుతోంది. ఔట్ ఫ్లో 19694 క్యూసెక్కులుగా ఉంది. సింగూర్ రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 523.600 మీటర్లకు గాను... ప్రస్తుతం నీటి మట్టం 523.545 మీటర్లకు చేరింది.