మైనార్టీలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది
టిడిపి నేత చంద్రమోహన్ రెడ్డి మండిపాటు
నెల్లూరు,నవంబర్11(జనంసాక్షి): నంద్యాల ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అలాగే పోలీస్ వేదింపులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ ఘటన రుజువు చేసిందన్నారు. పోలీసుల కిరాతకం కారణంగానే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం బలైపోయిందని విమర్శించారు. ఒక మైనార్టీ పౌరుడి కుటుంబానికి పోలీసుల తీరుతో ఇలాంటి పరిస్థితి రావడం మనస్సును కలిచివేస్తోందన్నారు. 70 వేలు పోయాయని ఎవరో కేసు పెడితే రుజువు కాకుండానే ఇంతలా వేధిస్తారా అని ప్రశ్నించారు. సలాం దంపతులు తమ బిడ్డల కాళ్లు, చేతులు కట్టేసి రైలు పట్టాలపై మెడలు పెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పోలీసులు తేవడం దారుణమన్నారు. ఇంతకన్నా ఘోరముంటుందా అని వ్యాఖ్యానించారు. ఈ భారతదేశంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా అని నిలదీశారు. ఏపీలో కొందరు పోలీసులుమితివిూరి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కాదని తాము ఏమి చేయలేక పోతున్నామనే స్థితికి కలెక్టర్లు, ఎస్పీలు వచ్చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు పూర్తిగా ఎమ్మెల్యేల చేతుల్లో చేరి నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. కలెక్టర్, ఎస్పీలు నిస్సహాయులుగా మిగిలిపోయారన్నారు. పోలీసుల వేధింపులకు భయపడొద్దని ¬ం మంత్రి సెలవిస్తున్నారని..అంతేకానీ వేధింపులు ఆపుతామని మాత్రం చెప్పలేకపోతున్నారని.. ఇంతటి దారుణాలు జరుగుతున్నా పోలీసులపై చర్యలు తీసుకునేందుకు ¬ం మంత్రి ధైర్యం చేయలేకపోతున్నారని అన్నారు. మొన్నేమో రాజమండ్రిలో పదేళ్ల పసిబిడ్డపై అత్యాచారం ఘటనలో పోలీసులే కేసు ఉపసంహరించుకోమని ఒత్తిడి తెచ్చారని..చివరకు కుటుంబపెద్ద ఆత్మహత్యా యత్నం చేసుకున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతిలో నిరసన తెలిపిన రైతులకేమో 13 రోజులయినా బెయిల్ రాదు కానీ...సలాం కుటుంబం ఇంత ఘోరంగా ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన పోలీసులకు మాత్రం 12 గంటల్లో బెయిల్ ఇచ్చారని మండిపడ్డారు. సీఐ, హెడ్ కానిస్టేబుళ్లను మాత్రమే కాదని..ఎస్పీ, డీఎస్పీలను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విూ పోలీసులపై విచారణ విూ పోలీసులతోనా..సీబీఐ ఎంక్వయిరీ చేయాల్సిందే..సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాల్సిన కేసు ఇది అని సోమిరెడ్డి స్పష్టం చేశారు.