కెసిఆర్‌ కుటుంబంలోనే సామాజిక న్యాయం


బడుగు,బలహీనవర్గాలను పట్టించుకోని కెసిఆర్‌


తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది


తెలంగాణ బీసీల గోస సభలో బిజెపి ఓబిసి అధ్యక్షుడు లక్ష్మణ్‌


హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం పేరుతో తన కుటుంబ సభ్యులకు మాత్రమే న్యాయం చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్‌. బుధవారం నాగోల్‌ లోని శుభం కన్వెన్షన్‌ హాలులో జరిగిన  బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ బీసీల గోస సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్‌.. బడుగు బలహీన వర్గాల ప్రజలను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు. చాయ్‌ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కావడం కేవలం బీజేపీలొనే సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ లో తండ్రి సీఎం, కొడుకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, అల్లుడు మంత్రి, కూతురు ఎమ్మెల్సీ..దొడ్డి దారిన కవితను ఎమ్మెల్సీ చేశారన్నారు. కేసీఆర్‌ మనువడికి వయసు లేదు కాబట్టి ఆగారు. లేదంటే ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేవారన్నారు. తెలంగాణ వస్తే బడుగుల జీవితాలు బాగువుడుతాయని ప్రజలు ఆశించారు కానీ.. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. టీఆరెస్‌ ప్రభుత్వం బీసీలను పట్టించుకోవడం లేదని బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించిన విడుదల 


చేయరన్నారు. శిన్నారు. వచ్చే గ్రేటర్‌ ఎన్నికల్లో బీసీలు టిఆర్‌ ఎస్‌ కు బుద్ది చెప్పాలన్నారు. కేసీఆర్‌ గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టాలన్నారు. దుబ్బాక ఎన్నికల్లో కేసీఆర్‌ కు తగిన బుద్ధి చెప్పారని..టీఆరెస్‌ ను ఓడించాలంటే బీజేపీకే సాధ్యమన్నారు. హిందూ ధర్మాన్ని అవమానిస్తే సహించబోమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం టీఆర్‌ఎస్‌కు చెంపపెట్టన్నారు. దుబ్బాకలాగే హైదరాబాద్‌ ప్రజలు కూడా బీజేపీని ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా దుబ్బాక ప్రజలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అన్నింటికి తెగించి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అహంకార మెక్కువని బండి సంజయ్‌ అన్నారు. అదే అహంకారంతో దుబ్బాకలో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో నియంత, దౌర్భగ్య, అవినీతి పాలన జరుగుతోందన్నారు. వాటన్నింటికి సమాధి కట్టాలంటే.. అది బీజేపీ ద్వారానే సాధ్యమని అన్నారు. తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగాలని భావించి దుబ్బాక ప్రజలు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఇకపోతే ఓడిపోతామని తెలిసే మంత్రి హరీష్‌రావును కావాలనే సీఎం కేసీఆర్‌ బలి పశువును చేశారని బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌రెడ్డి ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 80 డివిజన్లలో గెలవబోతున్నామని తెలిపారు. విజయశాంతి పార్టీలో ఎప్పుడు చేరుతుందో సమాచారం లేదన్నారు. బీజేపీ కచ్చితంగా హిందువుల పార్టీనేనన్న సంజయ్‌ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానన్నారు. ఎంఐఎం ముస్లింల కోసం పనిచేయగా లేనిది.. బీజేపీ హిందువుల కోసం పనిచేస్తే తప్పేంటని జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు.