ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలపై ఆదేశాలు జారీ

అమరావతి,నవంబర్‌11(జనంసాక్షి) :  రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా 7 జిల్లాల్లో అమలవుతున్న చికిత్సలు మిగిలిన 6 జిల్లాలకు వర్తించనున్నాయి. 2200 చికిత్సలకు ఆదనంగా మరో 233 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. నిధులు పక్కదారి పట్టకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.