రోడ్డున పడ్డ బాణాసంచా వ్యాపారులు

 


ఆలస్యంగా హైకోర్టు తీర్పు రావడంతో కోట్లలో నష్టాలు


కరోనా వేళ కాల్చకపోవడమే మంచిదంటున్న వైద్యులు


హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): దీపావళికి రెండు రోజుల ముందు వచ్చిన హైకోర్టు తీర్పుతో తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని పటాకుల విక్రేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజలు కరోనా, లాక్‌డౌన్‌ వల్ల పటాకులు కొనుగోలు చేయడం లేదు. యేటా మంచి లాభాలు ఉండేవి. వాతావరణం


కాలుష్యం చేయొద్దని నిపుణులు పటాకులు కాల్చద్దని అంటున్నారు. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాతావరణం కారణంగా నిషేధం విధించారు. పటాకులు కాల్చడంతో హానికర రసాయనాలు వెలువడుతాయి. దీంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ¬ం ఐసొలేషన్‌లో ఉన్న కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల విూద వీటి ప్రభావం మరింతగా ఉంటుంది. వయో వృద్ధులు, చిన్న పిల్లలు, ఇతర వ్యాధులున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) పెరిగి, కాలుష్యం తగ్గాలంటే అధికారులు పటాకుల అమ్మకాలు చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పటాకులు కాల్చకుండా మన పరిసరాలను మనమే రక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీపావళి అంటే ప్రమిదలు, పిండి వంటకాలు, మిఠాయిలు, బొమ్మల కొలువులు.. ఇవే కాకుండా పటాకులకూ ప్రత్యేక స్థానముంది. వేలు వెచ్చించి నగరవాసులు పటాకులు కొనుగోలు చేస్తారు. మహా నగరంలో దీపావళి వేడుకలు అంబరాన్నం టుతాయి. ఇదంతా దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు. ప్రస్తుతం దీపావళి పండుగకు పటాకుల కొనుగోలుకు చాలా మంది ప్రజలు ఆసక్తి కనబర్చడం లేదు. కొవిడ్‌తో కోల్పోయిన ఉపాధి, మరోవైపు వైరస్‌ వ్యాప్తితోపాటు వాతావరణ కాలుష్యాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. తాజాగా గురువారం రాష్ట్ర హైకోర్టు పటాకుల అమ్మకం, కాల్చడంపై నిషేధం విధించింది. దీంతో పటాకులు విక్రయించే చిరు వ్యాపారుల్లో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. మహా నగరంలో 60 లక్షలపైన ఉన్న జనాభాకు అనుగుణంగా పటాకుల దుకాణాలు సైతం పదివేలకు పైగానే ఏర్పడుతాయి. ఒక్కో డివిజన్‌కు 50 నుంచి 70 దుకాణాలు వెలసినా ఎనిమిది వేల నుంచి పదివేల పైనే ఈ తరహా దుకాణాలు ఉంటాయని తెలుస్తుంది. ఈ దుకాణాలు గల్లీకి రెండు నుంచి మూడు చొప్పున ఏర్పాటయ్యాయి. ఒక్కో దుకాణంలో రూ.లక్ష విలువజేసే పటాకుల సరుకు ఉంటుంది. తాత్కాలికంగా వెలిసిన ఈ దుకాణాలన్నింటి లో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల పటాకుల సామగ్రిని చిరు వ్యాపారులు స్టోర్‌ చేసుకొని పెట్టుకున్నారు. పదివేల పెట్టుబడి పెడితే, 20 వేల వరకు రాబడి వస్తుందనే దృష్టితో చిరు వ్యాపారులు సరుకు కొనుగోలు చేశారు. దీంతో లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారంలో ఏ మేరకు లాభాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. రెండు మూడు రోజుల్లోనే నగరంలో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం పటాకుల రూపేణా జరుగుతుంది. ఇద్దరి నుంచి నలుగురు వరకు ఒక కూటమిగా ఏర్పడి పటాకుల దుకాణాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకొని, నోయిడా, శివకాశీ నుంచి దీపావళి పటాకుల సామగ్రిని దిగుమతి చేసుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కొవిడ్‌-19 దృష్ట్యా వాతావరణాన్ని కలుషితం చేయొద్దంటూ అధికార యంత్రాంగం, శాస్త్రవేత్తలు, నిపుణులు, చివరకు హైకోర్టు సైతం తీర్పునిచ్చింది. దీనికి తోడు గత ఏడెనిమిది నెలలుగా కరోనా కారణంగా ఎంతో మంది కొలువులు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది దీపావళి వేడుకకు దూరంగా ఉంటున్నారు. పండుగను జరుపుకొనే స్థితి లో లేరు. ఈ నేపథ్యంలో పటాకుల వ్యాపారుల్లో నైరా శ్యం చోటు చేసుకుంది. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన దుకాణాలకు కస్టమర్లు రాక వెలవెలబోతున్నాయి.