మేడ్చల్ మల్కాజిగిరి,నవంబర్13(జనంసాక్షి): దేశంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సంక్షేమం పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని రెవెన్యూ కార్యాలయంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.పేదింట్లో పెండ్లిళ్లు చేయడానికే ఇబ్బంది పడే కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు భరోసాను నింపాయన్నారు. కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కమిషనర్ నేతి మంగమ్మలతో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు మేకల అయ్యప్ప, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కళ్యాణలక్ష్మి చెక్కులను అందచేసిన మంత్రి